శృతిహాసన్(Shruti Haasan) ఈ పేరు గురించి చెప్పక్కర్లేదు. కమల్‌హాసన్(Kamal Haasan) కూతురుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన శృతి తన సొంత టాలెంట్‌తో పైకొచ్చారు. బిజీబిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ నటిగానూ మారారు. శృతిహాసన్‌కు నటిగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్(Music Director), సింగర్‌గా(Singer) కూడా మంచి పేరుంది. ఆయా రంగాల్లో శృతిహాసన్ దూసుకెళ్తున్నారు.
శృతిహాసన్(Shruti Haasan) ఈ పేరు గురించి చెప్పక్కర్లేదు. కమల్‌హాసన్(Kamal Haasan) కూతురుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన శృతి తన సొంత టాలెంట్‌తో పైకొచ్చారు. బిజీబిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ నటిగానూ మారారు. శృతిహాసన్‌కు నటిగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్(Music Director), సింగర్‌గా(Singer) కూడా మంచి పేరుంది. ఆయా రంగాల్లో శృతిహాసన్ దూసుకెళ్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో హిట్లు కొట్టి ప్రేక్షకులను అలరించింది. శృతిహాసన్ సోషల్ మీడియాలోనూ(Social media) ఎప్పటికప్పడు తన అభిప్రాయాలను పంచుతూ, ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటుంది. తనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకుండా.. తన సినిమాలపై ఫ్యాన్స్‌తో అపడేట్స్ షేర్ చేసుకుంటుంది.
అయితే శృతిహాసన్ సినిమాలు మాత్రమే చేయడం కాదు.. మ్యూజిక్ ఆల్బమ్స్(Music Albums) కూడా చేస్తోంది. మ్యూజిక్‌పై ఆమెకు మంచి పట్టు ఉంది. సింగర్‌గా పాటలు కూడా పాడుతుంది. ఈవెంట్స్, స్టేజ్ షోలపై(Stage Show) తన పర్ఫార్మెన్స్‌తో అదరగొడుతోంది. తాజాగా GQMOTY అనే ఈవెంట్‌లో(event) పాల్గొని రెచ్చిపోయింది. ఈ ఈవెంట్‌లో ఇంగ్లీష్ సాంగ్‌ను ఎత్తుకుంది. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంది. హాలివుడ్ సింగర్ స్థాయిలో పర్‌ఫార్మెన్స్ ఇచ్చిపడేసింది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది.
శృతి సినిమాలకు వస్తే ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా మూవీ సలార్‌లో(Salaar) శృతిహాసన్ నటిస్తున్నారు. హాలివుడ్ మూవీ 'ది ఐ'(The Eye)లో తొలిసారిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని శృతి తెలిపారు. అయితే తనకు చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేదని సబ్జెక్ట్‌ను బట్టి సినిమాలను ఎంచుకుంటానన్నారు. త్వరలోనే ఓ ఆల్బమ్ కూడా రిలీజ్ చేస్తానని శృతి తెలపడం విశేషం. తాను తమిళ అమ్మాయినన్న శృతి.. తమిళ సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు.