సినిమా పరిశ్రమలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణమంటుంటారు. దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బాలీవుడ్‌లో పుట్టుకొచ్చినన్ని వదంతులు ఏ సినీ ఇండస్ట్రీలో పుట్టుకురావు. ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపించి మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని మనం చూశాం. రాజ్‌కపూర్-నర్గిస్, దిలీప్‌కుమార్-మధుబాల, దిలీప్‌కుమార్ -కామిని కౌశల్, దేవానంద్-సురయ్యా ఇలా చాలా మందే ఉన్నారు.
సినిమా పరిశ్రమలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణమంటుంటారు. దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బాలీవుడ్‌లో పుట్టుకొచ్చినన్ని వదంతులు ఏ సినీ ఇండస్ట్రీలో పుట్టుకురావు. ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపించి మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని మనం చూశాం. రాజ్‌కపూర్-నర్గిస్, దిలీప్‌కుమార్-మధుబాల, దిలీప్‌కుమార్ -కామిని కౌశల్, దేవానంద్-సురయ్యా ఇలా చాలా మందే ఉన్నారు. వీరి ప్రేమకథలేవీ సక్సెస్ కాలేదు. సౌతిండియా స్టార్ హీరో కమలహాసన్(Kamal haasan) చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నారు. వాణిగణపతిని పెళ్లి చేసుకున్న కమల్ తదనంతర కాలంలో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ మధ్యలో శ్రీవిద్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కాలేదు. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారికను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి జరగడం గమనార్హం. కమలహాసన్-సారికలు(Sarika) రిలేషన్‌లో ఉన్నప్పుడే శ్రుతి హాసన్(Shruti Haasan), అక్షర హాసన్ పుట్టారు. లేటెస్ట్‌గా సారిక గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కమలహాసన్ కంటే ముందు సారిక ఆనాటి స్టార్ క్రికెటర్ కపిల్‌దేవ్‌ను(Kapil dev) గాఢంగా ప్రేమించిందట! ఓ పార్టీలో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట! ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట! కుదిరితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట! అయితే కపిల్‌కు అప్పటికే రోమీ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కపిల్ దేవ్,సారికల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రావడంతో కపిల్‌ను రోమీ నిలదీశారట! అప్పుడు సారికకు బ్రేకప్ చెప్పి కపిల్ ,రోమీని వివాహం చేసుకున్నాడు. కపిల్‌దేవ్ కాదన్న తర్వాత సారిక డిప్రెషన్‌లోకి వెళ్లారట! దాన్నుంచి కమలహాసన్ బయటకు తీసుకొచ్చారట! ఆ కారణంగానే కమల్‌కు సారిక దగ్గరయ్యింది.