కమలహాసన్(Kamal Hassan) వారసురాలిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్(Shruthi Hassan) చాలా త్వరగా సొంత అస్తిత్వాన్ని చాటుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఆమె మల్టి టాలెంటెడ్. నటిగా పేరు తెచ్చుకోవడానికి ముందే సంగీతరంగంలో అడుగుపెట్టారు. అనేక ప్రైవేటు ఆల్బమ్‌లను చేశారు. సంగీతంపై తనకున్న పట్టుతో సంగీత దర్శకురాలు కూడా అయ్యారు.
కమలహాసన్(Kamal Hassan) వారసురాలిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్(Shruti Hassan) చాలా త్వరగా సొంత అస్తిత్వాన్ని చాటుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఆమె మల్టి టాలెంటెడ్. నటిగా పేరు తెచ్చుకోవడానికి ముందే సంగీతరంగంలో అడుగుపెట్టారు. అనేక ప్రైవేటు ఆల్బమ్‌లను చేశారు. సంగీతంపై తనకున్న పట్టుతో సంగీత దర్శకురాలు కూడా అయ్యారు. తండ్రి కమలహాసన్ నటించిన ఉన్నైప్పోల్ ఒరువన్(Unnaippol Oruvan) సినిమాకు శ్రుతి హాసనే సంగీతాన్ని అందించారు. అలాగే మంచి రచయిత్రి కూడా! పాటలు కూడా అద్భుతంగా పాడుతారు. ఇంత మల్టీ టాలెంట్ ఉన్న శ్రుతి ఇప్పుడు సలార్(Salaar) కోసం సాహసం చేయడానికి రెడీ అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతి హాసన్ ఈ ఏడాది అటు చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో నటించారు.
ఇటు బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో నటించారు. రెండు సినిమాలు విజయవంతం అయ్యాయి. ఈమె నటించిన పాన్ ఇండియా సినిమా సలార్ విడుదలకు రెడీగా ఉంది. ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, ఈ సినిమాకు ఇటీవలే శ్రుతి హాసన్ డబ్బింగ్(Dubbing) చెప్పడం స్టార్ చేశారు. ఓవరాల్‌గా అయిదు భాషల్లోనూ ఈమె సొంత గొంతే వినిపించబోతున్నది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్‌ను పూర్తి చేసిన శ్రుతి హాసన్ మరో రెండు భాషలను డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో చెప్పడానికే నానా తంటాలు పడుతుంటారు. అలాంటి శ్రుతి హాసన్ అయిదు భాషలలో డబ్బింగ్ చెప్పడమంటే సాహసమే అనుకోవాలి. ప్రస్తుతం తెలుగులో నాని(Nani) హీరోగా వస్తున్న హాయ్ నాన్నతో(Hi Nana) పాటు ఇంగ్లీషులో ది ఐ(The Eye) అనే సినిమాలో నటిస్తున్నారు శ్రుతి హాసన్.