యంగ్ రెబల్ స్టార్(Rebel star) ను షాకింగ్ ప్రశ్న అడిగింది హీరోయిన్ శృతీ హాసన్(Shruti Haasan). ఆ ప్రశ్నకు షాక్ తిన్న ప్రభాస్(Prabhas).. తేరుకుని ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ ప్రభాస్ ను శ్రుతీ ఏమని అడిగిందంటే..?

యంగ్ రెబల్ స్టార్(Rebel star) ను షాకింగ్ ప్రశ్న అడిగింది హీరోయిన్ శృతీ హాసన్(Shruti Haasan). ఆ ప్రశ్నకు షాక్ తిన్న ప్రభాస్(Prabhas).. తేరుకుని ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ ప్రభాస్ ను శ్రుతీ ఏమని అడిగిందంటే..?

ప్రభాస్ వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. నిరాశలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ కు సలార్ ఊరటనిచ్చింది. పార్ట్ 1 మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమా దాదాజు 700కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఈక్రమంలో ప్రభాస్ అండ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ లుక్ చూసి.. అంతా ముచ్చటపడ్డారు కూడా. ఇక సక్సెస్ మీట్ తో పాటు ఏర్పాటు చేసిన పలు ఇంటర్వ్యూలో ప్రభాస్ కు షాకింగ్ క్వశ్చన్ వేసింది.

ఈ ఇంటర్వ్యూలో శృతి ప్రభాస్ ను ఉద్దేశించి.. మిమ్మల్ని రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు. ప్రభాస్ ఆ ప్రశ్నకు ఒకింత షాక్ అయ్యి.. కూల్ గా ఆన్సర్ ఇచ్చారు. పెదనాన్న(Krishnam Raju) రెబల్ స్టార్ కాబట్టి నన్ను రెబల్ స్టార్ అని పిలుస్తారని ఆయన అన్నారు. ఇక శృతి హాసన్ మాట్లాడుతూ ప్రభాస్ ను కలిసిన వారం రోజుల్లోనే ఆయనను డార్లింగ్(Darling) అని ఎందుకు పిలుస్తారో అర్థమైందని పేర్కొన్నారు.

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ గురించి, ఆయన సినిమాలు, ఆయన యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే.. ప్రభాస్ మార్కెట్ మాత్రం అమాంతం పెరిగిపోతూనే ఉంది. ప్రభాస్ ను చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఆయన ఎక్కువగా డార్లింగ్ అనే ఊతపదం వాడతారు.. ప్రభాస్ ను కూడా చాలామంది డార్లింగ్ అని పిలుస్తుంటారు. డార్లింగ్ షర్డ్స్ కూడా అపట్లో బాగా ఫేమస్. ఇక ప్రభాస్ ను రెబల్ స్టార్ అని కూడా పిలుస్తారు. టాలీవుడ్ లో ఒక్కొక్క హీరోకు ఒక్కోక్క బిరుదు ఉండగా..ప్రభాస్ కు కూడా యంగ్ రెబల్ స్టార్ అన్న బిరుదు ఉంది.

Updated On 20 Jan 2024 7:29 AM GMT
Ehatv

Ehatv

Next Story