ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగల నటి శ్రుతి హాసన్‌(Shruti Hassan). తండ్రి కమలహాసన్‌() గొప్ప నటుడు. తల్లి సారిక(Sarika) కూడా మంచి నటే! వారి అడుగుజాడలలో నడుస్తూ సినిమాల్లోకి వచ్చిన శ్రుతి హాసన్‌ ఇప్పటికే తల్లిదండ్రులకు తగిన కూతురుగా ఇప్పటికే పేరు సంపాదించుకుననారు. బాలీవుడ్‌లో వచ్చిన లక్‌ చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రుతి హాసన్‌ తర్వాత ఎక్కువగా దక్షిణాదిలోనే సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న శ్రుతి హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో(Prabhas) నటించిన పాన్‌ ఇండియా సినిమా సలార్‌(Salaar) రిలజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగల నటి శ్రుతి హాసన్‌(Shruti Hassan). తండ్రి కమలహాసన్‌() గొప్ప నటుడు. తల్లి సారిక(Sarika) కూడా మంచి నటే! వారి అడుగుజాడలలో నడుస్తూ సినిమాల్లోకి వచ్చిన శ్రుతి హాసన్‌ ఇప్పటికే తల్లిదండ్రులకు తగిన కూతురుగా ఇప్పటికే పేరు సంపాదించుకుననారు. బాలీవుడ్‌లో వచ్చిన లక్‌ చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రుతి హాసన్‌ తర్వాత ఎక్కువగా దక్షిణాదిలోనే సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న శ్రుతి హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో(Prabhas) నటించిన పాన్‌ ఇండియా సినిమా సలార్‌(Salaar) రిలజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌(Prashanth neel) సలార్‌ను రూపొందిస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కాకుండా శ్రుతి తెలుగులో హాయ్‌ నాన్న సినిమాలో నటిస్తున్నారు. శ్రుతి మంచి గాయని! సంగీత దర్శకురాలు కూడా! మల్టీ టాలెంటెడ్‌ అయిన శ్రుతికి ఇతర భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ మాతృభాష అయిన తమిళ చిత్ర పరిశ్రమ ఈమె ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. కారణాలు ఏమైనా విజయ్‌ సేతుపతికి(vijay sethupathi) జంటగా నటించిన లాభం చిత్రం తర్వాత శ్రుతిహాసన్‌ కోలీవుడ్‌లో కనిపించలేదు. పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ విడుదల తర్వాత కోలీవుడ్‌ లోనూ ఈమె బిజీ అవుతారేమో చూడాలి.

Updated On 11 Sep 2023 7:08 AM GMT
Ehatv

Ehatv

Next Story