లోకనాయకుడు కమలహాసన్‌(Kamal Hassan) కూతురైన శ్రుతిహాసన్(Shruthi Hassan) తనంతట తానుగా సినిమాల్లో అడుగుపెట్టారు. సక్సెస్‌ సాధించారు. తమిళంలోనే తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతిహాసన్‌ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంటారు.

లోకనాయకుడు కమలహాసన్‌(Kamal Hassan) కూతురైన శ్రుతిహాసన్(Shruthi Hassan) తనంతట తానుగా సినిమాల్లో అడుగుపెట్టారు. సక్సెస్‌ సాధించారు. తమిళంలోనే తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతిహాసన్‌ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంటారు. అప్పుడప్పుడు చాలా ఫన్‌ చేస్తూ ఉంటారు. ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ అంటూ నెటిజన్స్‌తో సందడి చేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా చిట్‌చాట్‌ను నిర్వహించారు శ్రుతి హాసన్‌. ఇందులో పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు నెటిజన్లు. ఇదే సమయంలో దొరికిందే ఛాన్స్‌ అన్నట్టుగా కొందరు పోకిరిలు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి ప్రశ్న ఒకటి వేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో జవాబిచ్చారు శ్రుతిహాసన్‌. కొందరు నెటిజన్లు చిన్నప్పటి ఫోటో షేర్‌ చేయమని అడిగారు. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటోను, అలాగే బాయ్‌ఫ్రెండ్‌ శంతన హజారికాతో ఉన్న ఫోటోను పెట్టమని అడిగారు. అలా నెటిజన్లు అడిగిన ఫోటోలన్నింటినీ శ్రుతి హాసన్‌ పోస్ట్ చేశారు. ఈలోగా ఓ నెటిజన్‌ చాలా వింత కోరిక కోరాడు. నీ పాదాల ఫోటో పెట్టు అని శ్రుతిని అడిగాడు. అయితే అతనికి శ్రుతి తనదైన శైలిలోనే స్పందించారు. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టారు. దీంతో నెటిజన్‌ అడిగిన వింత ప్రశ్నకు తగిన జవాబు చెప్పినట్టు అయ్యింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated On 1 Aug 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story