ఆటలో కానీ పాటలో కానీ నటనలో కానీ మగవాళ్లకు ఇచ్చినంత రెమ్యూనిరేషన్‌ను మహిళలకు ఇవ్వరు. ప్రైజ్‌మనీలో కూడా తేడా ఉంటుంది. దీనిపై మహిళా క్రికెటర్లు గట్టిగానే పోరాడారు. సినిమాల్లోనూ అంతే.. హీరోకు ఇచ్చినంత పారితోషికం హీరోయిన్‌కు ఇవ్వరు. అలా ఇవ్వాలనే అంటున్నారు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan). ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన రెమ్యునిరేషన్‌ను అందుకునే రోజు కోసమే తాను ఎదురుచూస్తున్నానని శ్రుతిహాసన్ అన్నారు.
ఆటలో కానీ పాటలో కానీ నటనలో కానీ మగవాళ్లకు ఇచ్చినంత రెమ్యూనిరేషన్‌ను మహిళలకు ఇవ్వరు. ప్రైజ్‌మనీలో కూడా తేడా ఉంటుంది. దీనిపై మహిళా క్రికెటర్లు గట్టిగానే పోరాడారు. సినిమాల్లోనూ అంతే.. హీరోకు ఇచ్చినంత పారితోషికం హీరోయిన్‌కు ఇవ్వరు. అలా ఇవ్వాలనే అంటున్నారు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan). ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన రెమ్యునిరేషన్‌ను అందుకునే రోజు కోసమే తాను ఎదురుచూస్తున్నానని శ్రుతిహాసన్ అన్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో (Cannes Film Festival) పాల్గొంటున్న శ్రుతిహాసన్ పలు అంశాలపై మాట్లాడారు. హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి తనకు రెండు దశాబ్దాలు పట్టిందన్న ప్రియాంకా చోప్రా మాటలపై స్పందించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ' ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) అద్భుతం సాధించారు. మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే విషయంపై కనీసం చర్చ కూడా జరగడం లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన పారితోషికం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని శ్రుతిహాసన్ అన్నారు. ‘‘గతంలో నేను కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసం కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కేన్స్ చలనచిత్ర వేడుకల్లో భారతదేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని శ్రుతిహాసన్ అన్నారు.