పెళ్లై పిల్లలు పుట్టినా... ఏజ్ పెరుగుతున్నా.. ఏమాత్రం వన్నె తగ్గడంలేదు..స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్. అదేహాట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. అంతే కాదు ఈమధ్య రేటు కూడా పెంచేసిందట.

పెళ్లై పిల్లలు పుట్టినా... ఏజ్ పెరుగుతున్నా.. ఏమాత్రం వన్నె తగ్గడంలేదు..స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్(shriya sharan). అదేహాట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. అంతే కాదు ఈమధ్య రేటు కూడా పెంచేసిందట.

హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తరువాత కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గించకుండా సీనియర్ హీరోల సరసన మెరుస్తోంది శ్రీయా శరణ్. కొన్నాళ్ళు గ్యాప్ఇచ్చినా.. ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. స్టార్‌ హీరోయిన్‌ గా టాలీవుడ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గను అంటోంది.

తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో గత 20 ఏళ్లుగా వెలుగు వెలుగుతోంది బ్యూటీ.. సినిమాలు చేస్తూ... స్టార్ ఇమేజ్ సాధించింది. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్‌ చేస్తూ.. ఇండస్ట్రీని అంటిపెట్టుకుని ఉంటుంది

చేసుకుంది ఫారెన్ వ్యక్తిని అయినా.. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు మాత్రం చేస్తోంది. ఇక్కడే ఉంటూ షూటింగ్స్ చూసుకుంటుంది. అప్పుడప్పుడు తన మెట్టినింటి దేశానికి వెళ్తుంది. ఈమధ్య ఈ బ్యూటీ హిందీలో నటించిన దృశ్యం 2 బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ విషయంలో సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

రీసెంట్ గా ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ పాన్ ఇండియా మూవీ కబ్జ సినిమాలో కూడా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది శ్రియా. కాగా ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది బ్యూటీ. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌ లో ఐటెం సాంగ్ కోసం శ్రియాను సంప్రదించారట.

ఇక ఈ బ్యూటీ ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్‌(remuneration) డిమాండ్ చేసిందట. ప్రస్తుతం ఈ టాక్‌ జోరుగా నడుస్తోంది. ఏజ్ ఇంత పెరిగింది.. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యింది.. మరి ఇంత డిమాండ్ ఏంటీ అని చెవులు కొరుక్కుంటున్నారట మేకర్స్.. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. శ్రీయా శరణ్ వల్ల .. ఆమె సాంగ్ వల్ల సినిమాకు మంచి డిమాండ్ వస్తే మటికి.. ఆమెకు కోటీ సమర్పించుకోవలసిందే..? ఇండస్ట్రీలో శ్రీయా సాంగ్ సెంటిమెంట్ మొదలవుతుంది అప్పుడు

Updated On 20 April 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story