బాలీవుడ్‌లో(Bollywood) ప్రభాస్ రేంజ్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలు వణికిపోతున్నారు. ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయాయి. అది కూడా వరుసగా! దీంతో రెబల్‌స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు మొదలయ్యింది. తాజాగా ఆదిపురుష్(adipurush) సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా పలు రికార్డును సృష్టించింది.
బాలీవుడ్‌లో(Bollywood) ప్రభాస్ రేంజ్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలు వణికిపోతున్నారు. ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయాయి. అది కూడా వరుసగా! దీంతో రెబల్‌స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు మొదలయ్యింది. తాజాగా ఆదిపురుష్(adipurush) సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా పలు రికార్డును సృష్టించింది. మొదటి మూడు రోజుల్లో 340 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆదిపురుష్ సినిమా అయిదు రోజుల్లోనే 400 కోట్ల రూపాయలను దాటేసింది.
దేశమంతటా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇలాంటి కలెక్షన్లు రావడం చాలా కష్టం. కానీ ప్రభాస్ ప్రభంజనం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికే బాహుబలి-1(Bahubali-1), బాహుబలి-2(bahubali-2) సినిమాలతో పాటు సాహో(sahoo) కూడా 300 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసింది. ఇదే లిస్టులో ఆదిపురుష్ కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్ సాధ్యం కాలేదు. కేవలం ప్రభాస్‌కు మాత్రమే ఇది సాధ్యమయ్యింది. బాలీవుడ్‌లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి సాధ్యమయ్యే ఈ అరుదైన ఫీట్‌ను టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రభాస్ సృష్టించడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బాగోలేదని టాక్ వచ్చిన సినిమాతోనే ఇన్ని రకాల విధ్వంసాలు సృష్టిస్తే సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె చిత్రాలతో వస్తున్న ప్రభాస్‌ను ఆపే దమ్ము ఎవరికీ లేదని అంటున్నారు.
రాబోయే రోజుల్లో ప్రభాస్ నుంచి బాలీవుడ్ హీరోలకు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నటి శ్రియా రెడ్డి(Shriya reddy) ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంచుమించు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సలార్(salaar) సినిమా కేజీఎఫ్‌కు(KGF) మించి ఉంటుందని, ఓ రకంగా రెండు కేజీఎఫ్ సినిమాలకు సమానంగా సలార్ వస్తుందని శ్రియా రెడ్డి అన్నారు. తాను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్, యాక్షన్‌ను చూడలేదని, ప్రశాంత్ నీల్(Prashanth Neel) గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లాగా ఓ ప్రపంచాన్ని సృష్టించాడని ఆమె కితాబిచ్చారు. ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడని, ఇందులోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అని ఆమె చెప్పారు. సెప్టెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.