భారత క్రికెట్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) టీమిండియాలో(Team India) తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇందులో స్వయకృతాపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి. అరుదుగా వచ్చే అవకాశాలను నిలబెట్టుకోలేకపోతున్నాడతను! క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బీసీసీఐ(BCCI) సెంట్రల్‌ కాంట్రాక్ట్ కూడా శ్రేయస్‌ అయ్యర్‌ కోల్పోయాడు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం లైమ్‌లైట్‌లోనే ఉంటాడు. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది

భారత క్రికెట్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) టీమిండియాలో(Team India) తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇందులో స్వయకృతాపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి. అరుదుగా వచ్చే అవకాశాలను నిలబెట్టుకోలేకపోతున్నాడతను! క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బీసీసీఐ(BCCI) సెంట్రల్‌ కాంట్రాక్ట్ కూడా శ్రేయస్‌ అయ్యర్‌ కోల్పోయాడు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం లైమ్‌లైట్‌లోనే ఉంటాడు. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. ఆమెతో అయ్యర్‌ కేవలం ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే పెట్టుకోలేదని, డేటింగ్‌ వరకు వెళ్లిందని అంటున్నారు. ఇద్దరూ పరస్పరం అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటూ తమ రిలేషన్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారట!ఆ డియరెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరంటే బాలీవుడ్‌ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌(shraddha Kapoor). అదేనండి సాహో సినిమాలో నటించింది కదా! ఆ అందాల తారే! ఈమధ్యనే శ్రేయస్‌ అయ్యర్‌, శ్రద్ధా కపూర్‌ కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఇద్దరూ సెలెబ్రిటీలే! ఒకరేమో స్టార్‌ క్రికెటర్‌. మరొకరు టాప్‌ హీరోయిన్‌. ఈ విధంగా ఒకరినొకరు ఫాలో కావడంతోనే అనుమానాలు వస్తున్నాయి. ఇద్దరూ రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నారేమోనని నెటిజన్లు అనుకుంటున్నారు. క్రికెట్‌కు సినిమాకు దగ్గర సంబంధమే ఉంది. పటౌడి-షర్మిలా టాగూర్‌ జంట ఎంత పాపులరో తెలుసు కదా! మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ కూడా అనుష్కశర్మను పెళ్లి చేసుకోలేదూ! అంతెందుకు రీసెంట్‌గా కె.ఎల్‌.రాహుల్‌ కూడా బాలీవుడ్‌ నటినే కదా పెళ్లి చేసుకున్నది. అంచేత శ్రేయస్‌ అయ్యర్‌, శ్రద్ధా కపూర్‌లు కూడా ఒక్కటవ్వొచ్చు. చెప్పలేం! అన్నట్టు ఓ ముఖ్య విషయం చెప్పాలి. శ్రద్ధా కపూర్‌ రీసెంట్‌గా తన 37వ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలెబ్రెట్ చేసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ వయసు మాత్రం 29 ఏళ్లే!

Updated On 5 March 2024 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story