అక్కినేని నాగ చైతన్య(Akkineni naga chaithanya), శోభితా ధూళిపాళ్ల(shobitha dulipalla) నిశ్చితార్థం ఆత్మీయుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య(Akkineni naga chaithanya), శోభితా ధూళిపాళ్ల(shobitha dulipalla) నిశ్చితార్థం ఆత్మీయుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరు వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. చాలా కాలంగా నాగ చైతన్య, శోభితలు ప్రేమించుకుంటున్నారే తప్ప ఎప్పుడూ బయటపడలేదు. అలాగే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యింది. ఎంతగా అంటే ఈ వారం ఐఎండీబీ(IMDB) పాపులర్‌ ఇండియన్‌ సెటెబ్రిటీల జాబితాలో శోభిత టాప్‌ ప్లేస్‌లోకి చేరేంతగా! ఈ వారం పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల(Popular indian celebrity) లిస్ట్‌ను ఇండియన్‌ మూవీ డేటాబేస్‌ రిలీజ్‌ చేసింది. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన తర్వాత శోభిత ఒక్కసారిగా సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చేసింది. నాగచైతన్యతో పెళ్లికి ఆమె సిద్ధం కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. వీరి గురించి లక్షలాది నెటిజన్లు గూగుల్‌ సెర్చ్‌ చేశారు. మరీ ముఖ్యంగా శోభిత గురించి తెలుసుకునే ఆసక్తిని కనబరిచారు.

ఐఎండీబీ జాబితా ప్రకారం ఈ వారం ఫస్ట్‌ ప్లేస్‌లో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ నిలిచింది. ముంజ్యా మూవీ విజయం తర్వాత ఆమె క్రేజ్‌ విపరీతంగా . చైతుతో ఎంగేజ్‍మెంట్ వల్ల రెండో స్థానంలోకి శోభిత వచ్చేసింది. షారుఖ్‌​ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్​ సీనియర్ నటి కాజోల్, యంగ్​ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story