చైతుతో(chaithanya) ఎంగేజ్మెంట్(Engagement) తర్వాత శోభిత(shobitha) ఫస్ట్‌ రియాక్షన్‌.

చైతుతో(chaithanya) ఎంగేజ్మెంట్(Engagement) తర్వాత శోభిత(shobitha) ఫస్ట్‌ రియాక్షన్‌. ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. ‘మా అమ్మ, నాన్నలు నీకు ఏమైనా అయి ఉండవచ్చు. వారితో నీ బంధం ఏదైనా కావచ్చు.. మన పరిచయం ఎలా మొదలైనప్పటికీ.. మన హృదయాలు ప్రేమతో నిండిపోయాయి’ అంటూ ఎర్రని భూమి, వర్షంతో కూడిన ఎంగేజ్మెంట్‌ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇక ఈ పోస్టుకు పలువురు సెలెబ్రిటీలు స్పందించారు. , దియా మీర్జా, ఖుష్బు, డయానా పెంటీ, మలైకా అరోరా, ఎల్లి అవ్రామ్ వంటి సెలెబ్రిటీలు శోభితకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఫాలోవర్స్‌కూడా లక్షల మంది ఆమెను విష్‌ చేశారు.

నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక మన తెలుగువారయితే ఒక అడుగు ముందుకేసి తమ సహజగుణంలో భాగంగా ఆమె కులం గురించి కూడా సెర్చ్‌ చేస్తున్నారు. శోభిత తెనాలిలో పుట్టింది. బాల్యం, చదువు విశాఖపట్నంలో జరిగింది. ఆమె తండ్రి వేణుగోపాల్‌ రావ్‌ మర్చంట్‌ నేవీలో పనిచేశారు. తల్లి శాంతారావ్‌ టీచర్. ఆ తర్వాత ముంబైకి వలస వెళ్లింది. ముంబైలో లా చేసిన ఈ భామ అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2013లో ప్రతిష్టాత్మక పెమినా మిస్‌ ఇండియాగా నిలిచింది. అదే ఏడాది ‘మిస్‌ ఎర్త్‌’ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడుపుతోంది. హాలీవుడ్‌లో కూడా ఆమె నటించింది. బ్రిటిష్‌ నటుడు, నిర్మాత దేవ్‌ పటేల్‌తో కలిసి ‘మంకీ మ్యాన్‌’ అనే ఇంగ్లిష్‌ చిత్రంలో నటించింది శోభిత. పలు వెబ్‌సిరీస్‌లు కూడా చేసింది. అయితే గత కొంతకాలంగా నాగచైతన్యతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందరూ అనుకున్నట్లుగానే వీరి రిలేషన్ నిశ్చితార్థంతో అధికారికంగా మారింది



Updated On 10 Aug 2024 7:36 AM GMT
Eha Tv

Eha Tv

Next Story