తెలుగమ్మాయి శోభిత దూళిపాళ(Shobhita Dulipala) చేసినవి తక్కువ సినిమాలే అయినా పేరు తెచ్చే చిత్రాలలో నటించారు. నటి అన్నాక ఫలానా పాత్రలే చేస్తానంటే కుదరదని, తనకొచ్చిన అవకాశాల్లోంచే మంచి పాత్రలను ఎంచుకుంటున్నానని శోభిత చెప్పారు. చేసే ప్రతి పాత్రను వందశాతం మనసు పెట్టి చేస్తున్నానని తెలిపారు. ఎప్పుడూ తెరపై కనిపించాలని, తనకు చేతి నిండా పని ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రను ఒప్పుకునే రకం కాదని అన్నారు. తనకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయని, వాటికి అనుగునంగానే వచ్చిన అవకాశాల్లోంచి పాత్రలు ఎంచుకుంటానని అన్నారు.

'పాత్రల ఎంపికే తప్ప అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే కరణ్‌ జోహార్‌, ఫరాఖాన్‌లాంటి(Pharan Khan) గొప్ప దర్శకులతో కలిసి పని చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాల్నే వందశాతం మనసు పెట్టి చేస్తాను’ అని శోభిత దూళిపాళ చెప్పుకొచ్చారు. కమర్షియల్‌గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2(Made in heaven 2) లో ప్రధాన పాత్ర తనకు ఇవ్వడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని శోభిత తెలిపారు. అలాగే మణిరత్నం సర్‌ పొన్నియిన్‌ సెల్వన్‌లో మంచి ప్రాధాన్యం ఉన్న వాణతి పాత్రనిచ్చారని, నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నానని అన్నారు. ఆ రెండు పాత్రలూ వేటికవే ప్రత్యేకమని, ఆధునికత, మనో నిబ్బరం, నైతిక విలువలు, హడావుడి చేసే మనస్తత్వం మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2 లోని తార పాత్ర అని చెబుతూ అది తన జీవితానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. మూడేళ్లుగా తాను తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో భిన్నమైన పాత్రలు పోషించానని, తన పనితీరు దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకులకు నచ్చిందనే భావిస్తున్నానని, తాను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను కాబట్టే వాళ్లు తనను మళ్లీ ఆదరిస్తున్నారని, వాళ్ల అభిమానమే తనను మరిన్ని మంచి పాత్రలు ఎంచుకునేలా చేస్తోందని శోభిత ధూళిపాళ అన్నారు. 'డాన్‌ 3 చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యావా?’ అని చాలామంది అడుగుతున్నారు. డాన్‌ ఒక క్లాసిక్‌ చిత్రం. దానికి కొనసాగింపుగా వస్తున్న డాన్‌ 3లో భాగం కావాలని ఎవరికి మాత్రం ఉండదు? అది ఊహించుకుంటేనే చాలా ఉద్వేగంగా ఉంది' అని శోభిత తన మనసులోని మాట చెప్పారు. డాన్‌ 2లో రోమా పాత్రలో ప్రియాంకా చోప్రా అద్భుతంగా నటించారని, మూడో భాగంలో ఆడిషన్‌ ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, యాక్షన్‌, డ్యాన్స్‌, కామెడీ ఉన్న సినిమాలో నటించాలనేది ఎప్పట్నుంచో తన కోరిక అని శోభిత తెలిపారు.

Updated On 11 Sep 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story