బిగ్‌బాస్‌ (Biggboss) అమ్మడు శోభాశెట్టి (ShobhaShetty) రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫొటో ఒకటి వైరలవుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌లో ఉన్నప్పడు తన సహనటుడు యశ్వంత్‌తో (Yashwanth) ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకురాగానే ఓ స్టేజి మీద రింగులు మార్చుకోవడం కనిపించింది.

బిగ్‌బాస్‌ (Biggboss) అమ్మడు శోభాశెట్టి (ShobhaShetty) రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫొటో ఒకటి వైరలవుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌లో ఉన్నప్పడు తన సహనటుడు యశ్వంత్‌తో (Yashwanth) ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకురాగానే ఓ స్టేజి మీద రింగులు మార్చుకోవడం కనిపించింది. తర్వాత ఇద్దరు కలిసి రీల్స్ చేశారు. తాజాగా వీరు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం.

కార్తీక దీపం (Kartheeka Deepam) సీరియల్‌లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. బిగ్ బాస్‌ సీజన్‌ నడుస్తుండగానే ఆ విషయాన్ని శోభ వెల్లడించిది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు యశ్వంత్ చాలా సపోర్ట్ చేశాడు. శోభకు ఓట్లు వేయాలని ప్రేక్షకులను కోరాడు. శోభా శెట్టి, యశ్వంత్ నిశ్చితార్థం ఫోటోలు మా సీరియల్స్‌కు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పేజీ కవర్లో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోలలో ఇద్దరి తల్లిదండ్రులు కూడా ఉండటంతో ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిందంటున్నారు.

బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన డైలీ సీరియల్ కార్తీక దీపం. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరియల్‌తో పాపులరయిన శోభా బిగ్ బాస్ సీజన్- 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి చివరివారాల వరకు నిలబడింది. ఈ సందర్భంగా యశ్వంత్‌తో ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Updated On 23 Jan 2024 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story