రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం "శివ" (1989). ఈ సినిమా వెండితెరపై మ‌రోమారు గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం "శివ" (1989). ఈ సినిమా వెండితెరపై మ‌రోమారు గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన "శివ" బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అద్భుతమైన సాంకేతిక అంశాలు, వినూత్నమైన కథ, యాక్షన్ సన్నివేశాలకు థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ్డాయి. ఇప్ప‌టికీ తెలుగు సినిమాకు ఇది ఒక గీటురాయిగా కొనసాగుతోందని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. అమల హీరోయిన్‌గా.. రఘువరన్ విల‌న్‌గా నటించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం కూడా హైలౌట్‌గా నిలిచింది. తెలుగులో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను RGV హిందీలో రీమేక్ చేసాడు.. అందులో కూడా నాగార్జున తన పాత్రను తిరిగి పోషించాడు.


నాగార్జున పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన మ‌రో సినిమా 'మాస్‌' థియేట‌ర్ల‌లో రీరిలీజ్ చేశారు. ఆగ‌స్టు 28న రిలీజైన మాస్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. ఆగస్ట్ 29న నాగార్జున పుట్టిన రోజు కావ‌డంతో శివ సినిమా ట్రైల‌ర్‌ను ఆ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించారు. శివ సినిమాను కూడా అతి త్వరలో రీరిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ టీజర్‌ను వీడియోలు తీసి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శివ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో రిలీజ్ ఎప్పుడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే అభిమానులు శివ సినిమాను ఈ సారి 4K వెర్షన్‌లో చూడ‌నున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story