ప్రముఖ తమిళ హీరో శింబి(Shimbu) తెలుగువారికి కూడా పరిచయమే! ఆయన సినిమాలు చాలా తెలుగులో అనువాదం అయ్యాయి. పైగా ఈయనకు సంచలన నటుడు అనే పేరు కూడా ఉంది. ఇటీవల ఆయన నటించిన మానాడు, వెందు తనిందదు కాడు సినిమాలు విజయాన్ని చవి చూశాయి. తర్వాత వచ్చిన పత్తుతల మాత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరచింది. ప్రస్తుతం కమలహాసన్(Kamal Hassan) సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌లో నటిస్తున్నాడు.

Shimbu Marriage
ప్రముఖ తమిళ హీరో శింబి(Shimbu) తెలుగువారికి కూడా పరిచయమే! ఆయన సినిమాలు చాలా తెలుగులో అనువాదం అయ్యాయి. పైగా ఈయనకు సంచలన నటుడు అనే పేరు కూడా ఉంది. ఇటీవల ఆయన నటించిన మానాడు, వెందు తనిందదు కాడు సినిమాలు విజయాన్ని చవి చూశాయి. తర్వాత వచ్చిన పత్తుతల మాత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరచింది. ప్రస్తుతం కమలహాసన్(Kamal Hassan) సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ డేసింగు పెరియసామి(Daesingu Periasamy) దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కోసం శింబు మార్షల్ ఆర్ట్స్‌లో(Martial Arts) శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కాగా 40 ఏళ్ల నటుడు శింబు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చాలా మందిని ప్రేమించాడు కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే తన పెళ్లి గురించి మీడియా ఎప్పుడు అడిగినా బదులు దాటేస్తూ వస్తున్నాడు శింబు. ఆయన తండ్రి, దర్శకుడు, నటుడు టి.రాజేంద్రన్ కూడా టైమ్ వచ్చినప్పుడు తన కొడుకు పెళ్లి అవుతుందని ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు. లేటెస్ట్‌గా మరోసారి శింబు పెళ్లి గురించి ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినీ ఫైనాన్సియర్(Movie Financier) కూతురుతో శింబు ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు వినికిడి. అయితే దీని గురించి శింబు తరఫు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శింబు నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఇందులో నిజానిజాలు తెలియవు.
