బాలీవుడ్ నటి శిల్పా షెట్టి(Shilpa Shetty) ఫిట్‌నెస్‌కు(Fitness) చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే 50 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా ఆమె సోయగం ఏమాత్రం తగ్గలేదు. పాతికేళ్ల కిందట ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఉంది. మంచు శిల్పంలా తళుకులీనుతోంది. ఆమె నిత్యయవ్వనిలా ఉండటానికి కారణం యోగాసనాలే! ఫిట్‌నెస్ కోసం ఆమె యోగా చేస్తుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
బాలీవుడ్ నటి శిల్పా షెట్టి(Shilpa Shetty) ఫిట్‌నెస్‌కు(Fitness) చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే 50 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా ఆమె సోయగం ఏమాత్రం తగ్గలేదు. పాతికేళ్ల కిందట ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఉంది. మంచు శిల్పంలా తళుకులీనుతోంది. ఆమె నిత్యయవ్వనిలా ఉండటానికి కారణం యోగాసనాలే! ఫిట్‌నెస్ కోసం ఆమె యోగా చేస్తుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. లేటెస్ట్‌ఆ ఆమె సరికొత్త వ్యాయామ భంగిమను తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో పాటు దాని ప్రయోజనాలు కూడా చెప్పారు. రాజస్తాన్ టూర్‌లో ఉన్న ఆమె చక్కి చలసానా(Chakki Chalasani) భంగిమ విశేషాలను విడమర్చి చెప్పారు. చక్కీ చలసానా పదం వినేసి కంగారు పడకండి.. అదేమిటో చెబుతాను. విసుర్రాయి తిప్పుతుంటాం కదా! అలా తిప్పుతున్నట్టు చేసే ఆసనమే చక్కీ చలసానా! ఇప్పుడంటే గిర్నీలు, మిక్సీలు, గ్రైండర్లులు వచ్చాయి కానీ ఒకప్పుడు పిండి విసురుకోవడానికి తిరగలి మాత్రమే ఉండేది. విసుర్రాయితో పిండి విసిరేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం దొరికేది. ఆ భంగిమ వల్ల కలిగే లాభాలను చెబుతూ తిరగలి విసిరి మరీ చూపించారు శిల్పాషెట్టి. ఇలా చేయడం వల్ల నడుము, తొడలు, పిక్కల దగ్గర ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్‌గా ఉంటారో చెప్పుకొచ్చారు నటి శిల్పా. ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్ పోజ్ అంటారట! ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా వేస్తే ఉదరకండరాలు బలోపేతం అవుతాయి. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అయ్యి శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి వస్తుంది. వెన్నెముక, భుజాలు తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉపయోగపడే మంచి ఆసనమిది! ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా దృఢంగా ఉంటాయి. ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందండని సలహా ఇస్తున్నారు శిల్పా షెట్టి.