రాకేశ్‌ మాస్టర్‌ గొప్ప డ్యాన్సర్‌(Dancer). మాది ఎనిమిదేళ్ల అనుబంధం. ఆయన డ్యాన్స్‌కు సంబంధించి మీరు యూట్యూబ్‌లో చూసింది అయిదు శాతమే. ఆయన టాలెంట్‌ గురించి చాలామందికి తెలియదు. వ్యక్తిగతంగా నేను తొలుత ప్రభుదేవా మాస్టర్‌ నుంచి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌ వచ్చాక రాకేశ్‌ మాస్టర్‌ని అభిమానించడం ప్రారంభించాను . ఆయన నా గురువు అని చెప్పేందుకు గర్వంగా ఫీలవుతాను.

సెలబ్రిటీల మీద ఇష్టమొచ్చింది రాసేసి, నోటికొచ్చింది వాగేసే కొన్ని యూ ట్యూబ్‌ ఛానెళ్లపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు శేఖర్‌ మాస్టర్‌(shekar Master) . తమ గురించే కాదు, ఎవరి విషయంలోనైనా వాస్తవాలు తెలిస్తేనే రాయాలని విజ్ఞప్తి(Request) చేశారు.
తన గురువు రాకేశ్‌ మాస్టర్‌(Rakesh Master) తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్య సమస్యలతో అకాల మరణం చెందిన రాకేశ్‌ మాస్టర్‌ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. శేఖర్‌ మాస్టర్‌, సత్య మాస్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.

‘‘రాకేశ్‌ మాస్టర్‌ గొప్ప డ్యాన్సర్‌(Dancer). మాది ఎనిమిదేళ్ల అనుబంధం. ఆయన డ్యాన్స్‌కు సంబంధించి మీరు యూట్యూబ్‌లో చూసింది అయిదు శాతమే. ఆయన టాలెంట్‌ గురించి చాలామందికి తెలియదు. వ్యక్తిగతంగా నేను తొలుత ప్రభుదేవా మాస్టర్‌ నుంచి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌ వచ్చాక రాకేశ్‌ మాస్టర్‌ని అభిమానించడం ప్రారంభించాను . ఆయన నా గురువు అని చెప్పేందుకు గర్వంగా ఫీలవుతాను. అంత అద్భుతంగా నృత్యం చేసేవారాయన. ప్రాక్టీస్‌ చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఊరుకునేవారు కాదు.

ఆయన ఎలా ఉన్నా, ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాగానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన పెళ్లి మేమే చేశాం. అప్పట్లో డ్యాన్స్‌ తప్ప మాకు మరో ప్రపంచం తెలియదు. ఎప్పుడూ మాస్టర్‌ దగ్గరే ఉండేవాళ్లం. ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం, సాయంత్రం క్లాసులు చెప్పేవాళ్లం. కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్‌ పెట్టి రాసేస్తున్నారు. దాని వల్ల చాలామంది బాధపడతారు.

ఇదే కాదు ఎవరి విషయంలోనైనా వాస్తవాలు మాత్రమే రాయండి. లేదంటే రాయకండి’’ అని శేఖర్‌ మాస్టర్‌ అన్నారు. తన శిష్యుల్లో శేఖర్‌ అంటే చాలా ఇష్టమని రాకేశ్‌ మాస్టర్‌ పలు ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ పలు యూట్యూబ్‌ ఛానెళ్లు రాయడంపై శేఖర్‌ మాస్టర్‌ స్పందించారు. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో రాకేశ్‌ మాస్టర్‌తో మా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచీ నా ప్రతి సినిమాలో ఆయన భాగస్వామ్యం ఉంది. ఆయనకు, నాకు కొన్ని కామన్‌ అంశాలున్నాయి’’ అని దర్శక నిర్మాత వై.వి.ఎస్‌. చౌదరి అన్నారు.

Updated On 29 Jun 2023 7:46 AM GMT
Ehatv

Ehatv

Next Story