ప్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతీ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. శంకర్ మూవీస్ గురించి చెప్పాలంటే ఒకటా రెండా జీన్స్, భారతీయుడు, రోబో, ఒకే ఒక్కడు ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే ఈ డైరెక్టర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు భారతీయుడు-2 తోపాటు RC15తో బిజీబిజీగా ఉన్నారు. ఈ డైరెక్టర్ తాజాగా కమల్ హాసన్ తో చేస్తున్న భారతీయుడు-2 చిత్ర షూటింగ్ కంప్లీట్ చేశాడు. […]

ప్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతీ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. శంకర్ మూవీస్ గురించి చెప్పాలంటే ఒకటా రెండా జీన్స్, భారతీయుడు, రోబో, ఒకే ఒక్కడు ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే ఈ డైరెక్టర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు భారతీయుడు-2 తోపాటు RC15తో బిజీబిజీగా ఉన్నారు.

ఈ డైరెక్టర్ తాజాగా కమల్ హాసన్ తో చేస్తున్న భారతీయుడు-2 చిత్ర షూటింగ్ కంప్లీట్ చేశాడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు రామ్ చరణ్ సినిమాపై ఫుల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తీసే ప్రతి సినిమాను చాలా నీట్ గా ఫ్రేమింగ్ చేస్తారు. మూవీలో కనిపించే ఫ్రేమ్ టూ ఫ్రేమ్, బ్లాక్ టూ బ్లాక్, షాట్ టూ షాట్ ఇలా ప్రతీది ఆయన పక్కా ప్లాన్ తో డీల్ చేస్తారు.

అలాంటిది ఆయన బడ్జెట్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ సినిమా ఎంత బడ్జెట్ లో అవుతుంది.. సినిమా తగ్గట్టుగా సాంగ్స్ విషయంలోనూ స్పెషల్లీ లొకేషన్స్ బ్యూటీ విషయంలో ఆయన ఏమాత్రం తగ్గరు ఆయన. అయితే రీసెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ 15 సినిమాపై ఓ కొత్త న్యూస్ వైరల్ అవుతోంది.

RC15లో రామ్ చరణ్ త చేసేబోయే సాంగ్ ను భారీ బడ్జెట్ తోపాటు 500 మంది డాన్సర్లతో సాంగ్ ప్లాన్ చేయాలని డైరెక్టర్ శంకర్ మైండ్ లో మెదిలిందట. అయితే 500 మందితో సాంగ్ మేకింగ్ బడ్జెట్ కు నిర్మాత దిల్ రాజు ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తుంది. శంకర్ మాత్రం మేకింగ్ విషయంలో వెనకడుగు వేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.

మూవీ మేకింగ్ లోనూ, సాంగ్స్ మేకింగ్ లోనూ విజువల్ వండర్ చేయాలని చూస్తోన్న శంకర్ కు కొత్త చిక్కొచ్చి పడినట్టే అయింది. 500 మంది డాన్సర్లతో సాంగ్ మేకింగ్ విషయంలో డైరెక్టర్ శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొన్ని రోజులు వేచి చూడాలి మరి.

Updated On 7 Feb 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story