జగద్విఖ్యాత బౌలర్ షేర్ వార్న్ (Shane Warne) లాస్టియర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. లెగ్ స్పిన్‌కు ఘనకీర్తిని తెచ్చి పెట్టిన ఆ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ స్పిన్ బౌలర్‌గా పేరు గడించాడు. వార్న్ విసిరే బంతులు గింగిరాలు తిరుగుతూ బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెట్టేవి. గత ఏడాది థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఉన్నప్పడు షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోయాడు. 145 టెస్ట్‌లు ఆడిన వార్న్ 708 వికెట్లు తీసుకున్నాడు. 194 వన్డే మ్యాచ్‌లలో 293 వికెట్లు సాధించాడు.
జగద్విఖ్యాత బౌలర్ షేర్ వార్న్ (Shane Warne) లాస్టియర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. లెగ్ స్పిన్‌కు ఘనకీర్తిని తెచ్చి పెట్టిన ఆ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ స్పిన్ బౌలర్‌గా పేరు గడించాడు. వార్న్ విసిరే బంతులు గింగిరాలు తిరుగుతూ బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెట్టేవి. గత ఏడాది థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఉన్నప్పడు షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోయాడు. 145 టెస్ట్‌లు ఆడిన వార్న్ 708 వికెట్లు తీసుకున్నాడు. 194 వన్డే మ్యాచ్‌లలో 293 వికెట్లు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో (Cricket) వెయ్యి వికెట్లు తీసుకున్న ఘనతను సంపాదించాడు. షేన్ వార్న్ ఆటలో మెరుపులున్నాయి. కానీ వ్యక్తిగత జీవితంలోనే బోల్డన్ని మరకలు. అందుకే వార్న్ బయోపిక్ అనగానే అదో రకమైన ఆసక్తి పెరిగింది అందరికీ. ప్రస్తుతం వార్న్ బయోపిక్ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. లేటెస్ట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో భాగంగా ఓ శృంగార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో నటించే ప్రధాన పాత్రధారులు ఆసుపత్రి పాలయ్యారు. షేన్ వార్న్ పాత్రలో ఆస్ట్రేలియా నటుడు అలెక్స్ విలియమ్స్ (Alex Williams) నటిస్తున్నాడు. అతడి భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది. ఈ ఇద్దరు శృంగారం సీన్‌లో నటించాల్సి ఉంది. అది కాస్తా గాడి తప్పింది. దాంతో వీరిద్దరినీ హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తరలించాల్సి వచ్చింది. అలెక్స్ తలకు గాయం కాగా, కెన్నెడీ మణికట్టుకు దెబ్బ తగిలింది. . ప్రమాదంపై మార్నీ కెన్నెడీ ఏం చెబుతున్నారంటే ... 'షేన్ వార్న్, సిమోన్ యుక్త వయసులో ఉన్నప్పుడు జరిగే సీన్ అది. మేము ఇద్దరం కారిడార్లో నడుచుకుంటూ వెళుతుంటాం. అక్కడి నుంచి పడక గదిలోకి దూసుకెళ్లి, అక్కడున్న బెడ్‌పై పడిపోవాలని డైరెక్టర్ చెప్పాడు. మేమిద్దరం కారిడార్ నుంచి బెడ్‌రూమ్ వరకు బాగానే వచ్చాం. కాకపోతే బెడ్‌పై కాకుండా కింద పడ్డాం. వెంటనే మమ్మల్ని ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించారు' అని పేర్కొంది. షేన్ వార్న్ జీవితంపై రూపొందుతున్న ఈ మినీ సిరీస్‌కు వార్నీ అనే పేరు పెట్టారు. వార్న్‌ను అందరూ వార్నీఅని పిలిచేవారు. ఈ సిరీస్‌లో వార్న్ జీవితానికి సంబంధించిన అన్ని ప్రధాన సంఘటనలను, క్రికెట్‌లో అతడు అత్యున్నత స్థాయికి చేరుకున్న తీరును, వివాదాలను చూపించబోతున్నామని యూనిట్ తెలిపింది. ఇంగ్లీష్ నటి లిజ్ హర్లీతో వార్న్‌కు ఉన్న సంబంధాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. మొత్తంగా వార్న్ బయోపిక్‌కు ఎక్కడాలేని క్రేజ్ వచ్చేసింది.