తమిళంలో టాప్‌ కమెడియన్‌ వడివేలుకు(Vadivellu) ఆ మధ్యన అవకాశాలు లేకుండా పోయాయి. అందుకు రాజకీయాలే కారణం అంటారు. మొత్తానికి చాన్నాళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మామన్నన్‌(Mamannan) సినిమాలో నటించాడు వడివేలు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో వడివేలుకు తిరిగి ఆఫర్లు వస్తున్నాయి. మామన్నన్‌లో వడివేలు నటన గొప్పగా ఉందని విమర్శకులు సైతం అంటున్నారు.

తమిళంలో టాప్‌ కమెడియన్‌ వడివేలుకు(Vadivellu) ఆ మధ్యన అవకాశాలు లేకుండా పోయాయి. అందుకు రాజకీయాలే కారణం అంటారు. మొత్తానికి చాన్నాళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మామన్నన్‌(Mamannan) సినిమాలో నటించాడు వడివేలు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో వడివేలుకు తిరిగి ఆఫర్లు వస్తున్నాయి. మామన్నన్‌లో వడివేలు నటన గొప్పగా ఉందని విమర్శకులు సైతం అంటున్నారు. లేటెస్ట్‌గా పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తున్నారు. నటి షకీలా(shakila) కూడా ఓ ఇంటర్వ్యూలో వడివేలు గురించి బహిరంగంగా మాట్లాడారు. తొమ్మిదో దశకంలో హాట్‌ నటిగా వెలుగొందారు నటి షకిలా. ఆమె సినిమా విడుదలవుతున్నదంటే అగ్రహీరోలు కూడా తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునేవారు. షకీలాకు అంతటి క్రేజ్‌ ఉండేది.

మలయాళ, తమిళ సినిమాల్లోనే కాకుండా పాలు భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. గ్లామర్ సినిమాలలో నటించే షకీలా ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్‌ పాత్రలలో తనదైన నటనను కనబరుస్తున్నారు. విజయ్‌ టీవీలో ప్రసారమయ్యే కుక్‌ విత్‌ కోమలి అనే షో తర్వాత షకీలా చాలా పాపులరయ్యారు. ప్రస్తుతం ఆమె ఒక యూ ట్యూబ్‌ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ప్రేమ ప్రియ కొన్ని సంచలన విషయాలు చెప్పారు.

ఆమె ఏం చెప్పారంటే ' నా సినిమా కెరీయర్‌ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. అప్పట్లో నాకు మంచి అవకాశాలే వచ్చేవి. కానీ పరిశ్రమలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ వడివేలు కారణంగా అవి మధ్యలోనే నాకు కాకుండా పోయాయి. అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళతాను. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని నిర్మాత, దర్శకులకు చెప్పేవాడు. దాంతో నన్ను వెనక్కి పంపేవారు.

ఇలా చాలా సినిమాల్లో జరిగింది' అని ప్రేమప్రియ తెలిపారు. 'నేను యూట్యూబ్‌ ఛానెల్‌లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో వాసత్వం లేదని తిరిగి చెప్పాలని ఓ దర్శకుడు నన్ను ఫోన్‌లో బెదిరించాడు. అందుకు నేను భయపడలేదు. వడివేలు గురించి నేను నిజమే చెప్పాను. నేను చెప్పిన దాంట్లో కొంచెం కూడా అబద్ధం లేదు. 2010లో విజయ్‌ నటించిన సురా సినిమాలో వడివేలుతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన నోట చెప్పాడు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం కూడా చెప్పరు' అని ప్రేమ ప్రియ చెప్పారు. ఇంత జరుగుతున్నప్పుడు వడివేలుపై మీ టూ కంప్లయింట్‌ చేసి ఉండవచ్చు కదా అని షకీలా ప్రశ్నించినప్పుడు ప్రేమ ప్రియ బదులిస్తూ 'వడివేల్‌కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య' అని అన్నారు. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా చెబుతూ, షూటింగ్ స్పాట్‌లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 14 Aug 2023 7:16 AM GMT
Ehatv

Ehatv

Next Story