తెలుగు అగ్రహీరో లైంగిక వేధింపుల(Sexual harassment) కారణంగానే సినీ ఇండస్ట్రీ(Film Industry) నుంచి వైదొలిగానని ఇటీవల తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల(Social Media) దుమారాన్ని రేపాయి. ఆయన మిస్‌ బిహేవియర్‌ వల్లే ఇండస్ట్రీని వదిలేశానని, రెండు దశాబ్దాలుగా స్క్రీన్‌పై కనిపించలేదని విచిత్ర(Vichithra) చెప్పారు. ఆ హీరో ఎవరనేది ఆమె చెప్పకపోయినా చాలా మందికి అతడెవరో తెలిసిపోయింది. ఆ హీరో భుజాలు తడుముకోవడం లేదు కానీ, అతడి అభిమానులు మాత్రం గాయ్‌గత్తర చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా నటి షకీల(Shakila) విచిత్రకు మద్దతు తెలుపుతూ తనకు కూడా టాలీవుడ్‌లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

తెలుగు అగ్రహీరో లైంగిక వేధింపుల(Sexual harassment) కారణంగానే సినీ ఇండస్ట్రీ(Film Industry) నుంచి వైదొలిగానని ఇటీవల తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల(Social Media) దుమారాన్ని రేపాయి. ఆయన మిస్‌ బిహేవియర్‌ వల్లే ఇండస్ట్రీని వదిలేశానని, రెండు దశాబ్దాలుగా స్క్రీన్‌పై కనిపించలేదని విచిత్ర(Vichithra) చెప్పారు. ఆ హీరో ఎవరనేది ఆమె చెప్పకపోయినా చాలా మందికి అతడెవరో తెలిసిపోయింది. ఆ హీరో భుజాలు తడుముకోవడం లేదు కానీ, అతడి అభిమానులు మాత్రం గాయ్‌గత్తర చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా నటి షకీల(Shakila) విచిత్రకు మద్దతు తెలుపుతూ తనకు కూడా టాలీవుడ్‌లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పటి టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన ఈవీవీ సత్యనారాయణ(AVV Sathyanarayana) తనను అడ్జస్ట్‌మెంట్‌ గురించి అడిగారంటూ షకీల సంచలన ఆరోపణలు చేశారు. తమిళ యూట్యూబ్‌ ఛానెల్‌కు(Youtube channel) ఇచ్చిన ఇంటర్వ్యూలో షకిలా ఈ సంచలన కామెంట్‌ చేశారు. 'విచిత్ర నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలో నటించాము. ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి కారణంగా సినీ ఇండస్ట్రీ విలేయాల్సి వచ్చిందనేది విచిత్ర చెబితే బాగుండేది. అతడు ఎవరో బయటపెట్టి ఉండాల్సింది.నేను ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్‌ తండ్రి(allari Naresh), దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్‌మెంట్‌ అడిగాడు. తనతో అడ్జస్ట్‌ అయితే నాకు తర్వాతి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడు. అప్పుడు నేను... సార్‌ ఇప్పుడు ఈ సినిమాలో నటించినందుకు నా రెమ్యూనరేషన్‌ నాకు వచ్చేసింది. మరో సినిమా అవకాశం నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా నాకు లేదు అని ముఖం మీదే చెప్పేశాను. ఇప్పుడు ఈవీవీ సత్యనారాయణ బతికి లేరు. దీని గురించి తెలుగు సినీ పరిశ్రమ నన్ను ఎప్పుడు పిలిచి అడిగినా ఈ విషయం చెబుతాను. అవును, ఆ రోజు ఈవీవీ నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని షకీల చెప్పుకొచ్చారు. ఇప్పుడు షకీల చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనాలు రేపుతున్నాయి.

Updated On 28 Nov 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story