ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు(Shah Rukh Khan) బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్(Pathan) సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అంతకు మించి ఇటీవల వచ్చిన జవాన్(Jawan) హిట్టయ్యింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న షారుక్ బాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపాడు. కొంతకాలం కిందట వరకు బాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. హిందీ సినీ ఫీల్డ్ సరైన సక్సెస్‌లు లేక అల్లాడిపోతున్న సమయంలోనే సౌత్‌లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమాలు భారీ సక్సెస్‌లను అందుకుంటూ బాలీవుడ్‌లో వందల కోట్ల రూపాయలను వసూలు చేశాయి.
ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు(Shah Rukh Khan) బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్(Pathan) సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అంతకు మించి ఇటీవల వచ్చిన జవాన్(Jawan) హిట్టయ్యింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న షారుక్ బాలీవుడ్‌లో ఉత్సాహాన్ని నింపాడు. కొంతకాలం కిందట వరకు బాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. హిందీ సినీ ఫీల్డ్ సరైన సక్సెస్‌లు లేక అల్లాడిపోతున్న సమయంలోనే సౌత్‌లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమాలు భారీ సక్సెస్‌లను అందుకుంటూ బాలీవుడ్‌లో వందల కోట్ల రూపాయలను వసూలు చేశాయి. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో అయిదేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లోనే సెప్టెంబర్ 7న జవాన్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం 500 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్‌లో జవాన్ 1000 కోట్ల రూపాయల మార్క్‌ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే డంకీ. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే.
5