డంకీ సినిమా ఇమ్మిగ్రేషన్ సమస్య చుట్టూ తిరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తాము వలస

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డంకీ. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ సాలార్ కు పోటీగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఉత్తరాదిన మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ మూవీ లాంగ్ రన్ లో రూ.470 కోట్లు కలెక్ట్ చేసింది. షారుఖ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా డంకీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ఎంతో సైలెంట్ గా ఓటీటీలో డంకీ సినిమాను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

డంకీ సినిమా JioCinemaలో వస్తుందని భావించారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు మరొక OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది. డంకీ సినిమా ఇమ్మిగ్రేషన్ సమస్య చుట్టూ తిరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తాము వలస వెళ్లాలనుకునే ప్రదేశాలకు చేరుకోవడానికి చేసే ప్రయత్నాలను ఇందులో చూపించారు. షారూఖ్ ఖాన్ చిత్రంలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. పఠాన్, జవాన్ విజయాల తర్వాత 2023లో చివరిగా విడుదలైన షారూఖ్ ఖాన్ చిత్రం డంకీ.

Updated On 14 Feb 2024 11:59 PM GMT
Yagnik

Yagnik

Next Story