బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌(Shahrukh Khan), లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) కాంబినేషన్‌లో దర్శకుడు అట్లీ(Atlee) రూపొందిస్తున్న సినిమా జవాన్‌(Jawan).. ఈ సినిమాలో అద్భుత నటుడు విజయ్‌ సేతుపతి(Vijay sethupathi) విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నయనతార బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది నటీనటులు కలిసి పని చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌(Shahrukh Khan), లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) కాంబినేషన్‌లో దర్శకుడు అట్లీ(Atlee) రూపొందిస్తున్న సినిమా జవాన్‌(Jawan).. ఈ సినిమాలో అద్భుత నటుడు విజయ్‌ సేతుపతి(Vijay sethupathi) విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నయనతార బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది నటీనటులు కలిసి పని చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 7వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బీజీ అయ్యింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే సోమవారం ఛలోనా(Chalona) అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో షారూక్‌ఖాన్‌, నయనతార మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని అంటున్నారు ప్రేక్షకులు. జవాన్‌కు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. రెడ్‌ చిల్లిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ దీపిక పడుకొనే ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Updated On 15 Aug 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story