తమిళ యంగ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ(Atlee) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ.. షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా జవాన్(Javan). ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పటికే విడులైన టైటిల్ అనౌన్స్ మెంట్‌ టీజ‌ర్‌ సినిమా దేశ వ్యాప్తంగా అంచనాలు పెంచేస్తుంది. ఇప్పటికే పఠాన్ సినిమాతో.. కొనఊపిరితో ఉన్న బాలీవుడ్ కుప్రాణం పోసిన షారుఖ్ ఖాన్.. తాజాగా జవాన్ సినిమాతో మరో రికార్డ్ కు రెడీ అవుతున్నారు. ఇక ఈసినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం జవాన్‌లో షారుఖ్‌, నయనతారకు సబంధించి డ్యూయోట్ షూటింగ్ జరుగుతోంది. నట్టనడిసముద్రంలో.. షిప్ పై వీరి పాటకు సబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ కుసబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.అట్లీ ఈ పాటను సినిమాకు హైలెట్‌గా నిలిచేపోయేలా ప్లాన్ చేశాడని సమాచారం. ఇక ఈ పాటను ఫరాఖాన్‌ కొరియోగ్రాఫీ చేస్తున్నారు. ఇక ఈసాంగ్ ను పాపులర్ సింగర్ అర్జీత్ సింగ్ పాడాడు.

అంతే కాదు తాజా సమాచారం ప్రకారం ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవబోతుంది.

ఈ సినిమాకు తమిళ యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. హోంబ్యానర్‌ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు షారుక్‌ ఖాన్‌ మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న టైగర్‌ ప్రాంఛైజీ టైగర్‌ 3లో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. తాప్సీ పన్ను ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Updated On 13 April 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story