బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌(Shah Rukh Khan), లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) తొలిసారిగా కలిసి నటిస్తున్న జవాన్‌ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. పఠాన్(Pathan) తర్వాత షారూక్‌ సినిమా ఇదే కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌(Shah Rukh Khan), లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) తొలిసారిగా కలిసి నటిస్తున్న జవాన్‌(Jawan) సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. పఠాన్(Pathan) తర్వాత షారూక్‌ సినిమా ఇదే కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కమలహాసన్‌(Kamal Hassan) నటించిన ఖైదీ వేట(Khaidi Veta) సినిమా కథనే అటు ఇటుగా మార్చి ఈ సినిమాను అట్లీ తీశారని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. ఎనిమిదో దశకంలో తమిళంలో వచ్చిన ఒరు ఖైదియిన్‌ డైరీ సినిమాను తెలుగులో ఖైదీ వేటగా డబ్‌ చేశారు. తమిళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. భాగ్యరాజా అందించిన కథను దర్శకుడు భారతీరాజా అద్భుతంగా తెరకెక్కించారు.

ఆ సినిమాలో కమలహాసన్‌ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి కమలహాసన్‌ చట్టం దృష్టిలో నేరస్తుడు. కొడుకు పెద్ద పోలీసు ఆఫీసర్‌. తండ్రిని పట్టుకోవడానికి కొడుకు ప్రయత్నిస్తుంటాడు. అతడు తన తండ్రి అన్న సంగతి కొడుకుకు తెలియు. చివరకు తండ్రి తాను అనుకున్నది సాధించి చనిపోతాడు. జవాన్‌ కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అన్నట్టు ఇదే సినిమాను హిందీలో సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh bachchan)తో అఖ్రీ రాస్తా(Akri Rastha) తీశారు. భాగ్యరాజా దీనికి దర్శకుడు. హిందీలో అమితాబ్‌ సరసన జయప్రద, శ్రీదేవి నటించారు. హిందీలో కూడా విజయవంతమయ్యింది. ఇదే కథను అటుఇటుగా మార్చి తెలుగులో మారణహోమం తీశారు. చెన్నకేశవరెడ్డి కథ కూడా ఇలాగే ఉంటుంది. కథ మంచిగా ఉంటే ఎన్నిసార్లు తీసినా జనం చూస్తారని, కాకపోతే కొత్తగా ప్రజెంట్‌ చేయాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు.

Updated On 2 Sep 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story