వార్‌ 2కు పెరిగిన క్రేజ్‌!

స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు(Jr NTR) దేశమంతటా అభిమానులున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత తారక్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. వార్‌ 2లో(War-2) ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌తో(Hrithik Roshan) కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. తారక్‌ మొదటి హిందీ సినిమా కావడంతో చాలా మందికి వార్‌ 2పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో మరో టాప్‌ హీరో కూడా వచ్చి చేరాడనుకోండి.. ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ! ఇంతకీ ఎవరా హీరో అన్నదే కదా మీ క్యూరియాసిటీ? ఆయనే బీటౌన్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(shah rukh khan). బాలీవుడ్‌లో దీని గురించే చర్చించుకుంటున్నారు. బాలీవుడ్‌ కథనాల ప్రకారం షారుక్‌ ఖాన్‌ వార్‌ 2 సినిమాలో కామియో రోల్ చేయబోతున్నాడు. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే. ఇప్ప‌టికే విడుదల చేసిన వార్‌ 2 గ్లింప్స్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. YRF Spy Universeలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు ఇది. వార్‌ 2లో తార‌క్ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగే స్పై రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story