బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)సినిమా అంటే.. ఆడియన్స్ లో ఎక్కడలేని అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆయన సినిమా అంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

జవాన్(Jawan) సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు.. సౌత్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో జవాన్ టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ పై విజయ్ సేతుపతి ట్వీట్ చేయగా. ..షారుఖ్ రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)సినిమా అంటే.. ఆడియన్స్ లో ఎక్కడలేని అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆయన సినిమా అంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక లాంగ్ గ్యాప్‌ తర్వాత పఠాన్‌ సినిమాతో ఇండయన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారుఖ్.. ఆతరువాత ప్రస్తుతం జవాన్‌ సినిమాతోమరోసారి అదరగొట్టబోతున్నాడు. అంతే కాదు ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మొద‌టినుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది.

తాజాగా జవాన్‌ ప్రివ్యూ(Jawan Preview) పేరుతో మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు టీమ్. షారుఖ్‌ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ ఆడియన్స్ ను అలరిస్తోంది. ప్రతీ క్షణం అద్భుతమైన సన్నివేశాలతో.. ఈ టీజర్‌ ఆద్యంతం యాక్షన్‌ సీన్స్ తో... ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్‌ఖాన్‌ డిఫరెంట్ కగెటప్స్ లో కనిపించి అభిమానులను మెస్మరైజ్‌ చేశారు. అంతే కాదు ఈటీజర్‌లో మూవీ టీమ్ అంతటిని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపించింది. అంతే కాదు షారుఖ్‌ఖాన్‌ డిఫరెంట్‌ లుక్స్‌తో టీజర్‌ ఆసాంతం ఆసక్తిని పంచింది.

ఇక ఈ టీజర్ కు మరో స్పెషల్ అట్రాక్షన్ అనిరుధ్‌ (Anirudh Ravichandar) బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. ఈ దెబ్బతో అనిరుధ్ బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యే అవకాశాం కనిపిస్తోంది. అంతలా మ్యూజిక్ హైలైట్‌గా అయ్యింది. కాగా ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathy) నెగటివ్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జవాన్‌ ప్రివ్యూ పై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. జవాన్ ప్రివ్యూకి స్వాగతం.. ఇప్పుడు మీ కోసం... అంటూ త‌మిళంలో ట్వీట్(Tweet) చేశారు.

ఈ పోస్టుపై తాజాగా షారుఖ్‌ఖాన్‌ స్వీట్ రిప్ల‌య్‌(Replay) ఇచ్చారు. అంతటి హీరో.. విజయ్ సేతుపతికి ఎంత గౌరవం ఇచ్చాడంటే.. “సర్ మీతో వర్క్ చేయడం నా అదృష్టం. షూటింగ్‌లో మీరు నాకు తమిళం నేర్పించినందుకు.. అలానే మంచి ఫుడ్ అందించినందుకు చాలా థాంక్స్. ల‌వ్ యూ న‌న్బా” అంటూ షారుక్ ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌత్ ఆడియన్స్ షారుఖ్ ఖాన్ మర్యాదకు ఫిదా అవుతున్నారు.

Updated On 12 July 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story