బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, లేడి సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం జవాన్. దీనికి అట్లీ దర్శకుడు. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 7 తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, లేడి సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం జవాన్. దీనికి అట్లీ దర్శకుడు. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 7 తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ సేతుపతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే 'మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ పార్టీలో మొదటి సారి షారుక్ ఖాన్‌ను కలిశాను. ఆయన పక్కన కూర్చొనే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు ఆయన నన్ను ఎంతో ప్రశంసించారు. నా వర్క్‌ను మెచ్చుకున్నారు. ఆయన మాటలకు నేను షాకయ్యా. ఆయన అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఆయనతో కలిసి తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
‘‘అట్లీ గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. ఆయన దర్శకత్వం వహించిన తెరీ అంటే నాకెంతో ఇష్టం. ఆయన వర్కింగ్ స్టైల్, సినిమాని తీర్చిదిద్దే తీరు నాకెంతో నచ్చుతుంది. మరో విషయం ఏమిటంటే.. నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు నేనొక అమ్మాయిని ప్రేమించా. ఆమెకు షారుక్ అంటే అమితమైన ఇష్టం. ఇప్పుడు షారుక్ సినిమాలో నేను కీలక పాత్ర పోషించి ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్ తీర్చుకున్నా’’ అని సరదాగా చెప్పారు విజయ్ సేతుపతి. ఇక షారుక్ తమిళంలో మాట్లాడి సందడి చేశారు. డ్యాన్స్ గురించి చెబుతూ ప్రేక్షకులను నవ్వించారు. 'నేను విజయ్‌లా డ్యాన్స్ చేయలేను. కనీసం అట్లీ చేసినట్టు కూడా చేయలేను. అందుకే కష్టమైన స్టెప్పులు ఇవ్వొద్దని కొరియోగ్రాఫర్ శోభికి చెప్పాను' అని షారుక్ అన్నారు.