గతంలో సౌత్ సినిమా వాసనలే పడలేదు బాలీవుడ్ కు.. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కు సౌత్ సినిమాలు ఇడ్లీ సాంబర్ కథలు అనేవారు. అటువంటిది.. తన జవాన్(Jawan) సినిమాను తమిళంలో భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడట.

గతంలో సౌత్ సినిమా వాసనలే పడలేదు బాలీవుడ్ కు.. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కు సౌత్ సినిమాలు ఇడ్లీ సాంబర్ కథలు అనేవారు. అటువంటిది.. తన జవాన్(Jawan) సినిమాను తమిళంలో భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడట.

ఒకప్పుడు సౌత్ సినిమాన(South movies) చాలా చీప్ గా చూశారు బాలీవుడ్ స్టార్స్. కాని ఇప్పుడు బాలీవుడ్ కు ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ లేదు. కలెక్షన్స్ లేవు.. సౌత్ సినిమాలో పావలా వంతు కూడా సాధించ లేక పోతున్నారు. దాంతో ఇప్పుడు సౌత్ కోసం పాకులాడుతున్నారు బాలీవుడ్ స్టార్లు. అంతలా సౌత్ ను తీసిపారేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్ అట్లీతో(atlee) జవాన్ సినిమా చేశాడు.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను(Nayanthara) హీరోయిన్ గా పెట్టుకున్నాడు. అంతేనా.. తమిళ స్టార్ విజయ్ సేతుపతిని(Vijay sethuptathi) ఇంపార్టెంట్ రోల్ కు తీసుకున్నారు. సౌత్ జపం జపిస్తున్నారు.

సౌత్ నార్త్ మిక్సింగ్ తో తెరకెక్కిన జవాన్ సినిమాను ఇక్కడ కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ముఖ్యంగా తమిళంలో ఈసినిమాను గట్టిగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోనే దీపికా పదుకోన్(Padukone) ఓ ముఖ్య పాత్రలో కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ భారీ అంచనాలనడుమ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ దగ్గరలో ఉండగా షారుఖ్ ఖాన్ ఈసినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అయితే హిందీతో సహా తమిళం, తెలుగు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా లేటెస్ట్ గా అయితే జవాన్ తమిళ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ తెలుస్తుంది.

ఈ సినిమాను కోలీవుడ్ లో బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన రెడ్ జెయింట్ వారు గోకులం ఫిల్మ్స్ వారితో సంయుక్తంగా భారీ ధరకి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాట అంతా తమిళంతో సహా.. కొన్ని చోట్ల హిందీ వెర్షన్ ను కూడా రిలీజ్ ని చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో జవాన్ కి తమిళం లో కూడా గ్రాండ్ రిలీజ్ దక్కే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఈ మూవీకి కి ఆల్ మోస్ట్ తమిళ టెక్నీషియన్స్ నే వర్క్ చేశారు మరి తమిళంలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Updated On 19 Aug 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story