సినీ నటీనటులు సక్సెస్‌లో మేనేజర్ల(Managers) పాత్ర గొప్పది! నటీనటులకు, నిర్మాతలకు మేనేజర్లే సంధానకర్తలు. నటీనటుల డేట్స్‌, కాల్షీట్ల అడ్జెస్ట్‌మెంట్లు, రెమ్యూనిరేషన్లు వగైరా వగైరా అంతా మేనేజర్లే చూసుకుంటారు. అందుకే నటీనటుల కంటే మేనేజర్లకే గౌరవం ఇస్తుంటారు కొందరు నిర్మాతలు. హీరోమేనేజర్లు సూచనలను నటీనటులు పాటించి తీరాల్సిందే. మేనేజర్ల రోల్‌ చాలా కీలకం కాబట్టే స్టార్‌ హీరోహీరోయిన్లు నమ్మకస్తులనే మేనేజర్లుగా పెట్టుకుంటారు.

సినీ నటీనటులు సక్సెస్‌లో మేనేజర్ల(Managers) పాత్ర గొప్పది! నటీనటులకు, నిర్మాతలకు మేనేజర్లే సంధానకర్తలు. నటీనటుల డేట్స్‌, కాల్షీట్ల అడ్జెస్ట్‌మెంట్లు, రెమ్యూనిరేషన్లు వగైరా వగైరా అంతా మేనేజర్లే చూసుకుంటారు. అందుకే నటీనటుల కంటే మేనేజర్లకే గౌరవం ఇస్తుంటారు కొందరు నిర్మాతలు. హీరోమేనేజర్లు సూచనలను నటీనటులు పాటించి తీరాల్సిందే. మేనేజర్ల రోల్‌ చాలా కీలకం కాబట్టే స్టార్‌ హీరోహీరోయిన్లు నమ్మకస్తులనే మేనేజర్లుగా పెట్టుకుంటారు. చాలా మంది యాక్టర్లకు మేనేజర్లతో మంచి రిలేషన్‌ ఉంటుంది. బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ కూడా తన మేనేజర్‌(Managers) పూజా దద్దానీని(Pooja Daddani) చాలా ఆప్యాయంగా, ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. 2012 నుంచి షారుక్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు పూజా దద్లానీ . సినిమాకు సంబంధించిన విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలలో కూడా షారుక్‌కు సలహాలు ఇస్తుంటారు పూజా. షారుక్‌ ఫ్యామిలీతో ఆమెకు చక్కటి అనుబంధం ఏర్పడింది. షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌(Gauri Khan) అయితే పూజాను సొంత మనిషిలా చూసుకుంటారు. సెలబ్రిటీల పార్టీలకు పూజాను తీసుకెళుతుంటారు. షారుక్‌ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మోరల్‌ సపోర్ట్‌గా నిలుస్తూ ఉంటారు.

గురువారం రిలీజై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న జవాన్‌(Jawan) సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించారు. ఇదంతా ఓకేనే కానీ పూజా దద్లానీ సాలరీ ఎంతుంటుందనుకుంటున్నారు? ఏడాదికి ఏడు కోట్ల రూపాయల నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో షారుక్‌ ఖాన్‌ ఒకరు. కాబట్టే మేనేజర్‌కు అంత జీతం ఇవ్వగలడు. హీరోగా సినిమాలు చేస్తూనే రెడ్‌ చిల్లిస్‌ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు షారుక్‌. షారుక్‌ భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా బాగానే సంపాదిస్తున్నారు. షారుఖ్‌ ఫ్యామిలీ వార్షిక ఆదాయం 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. అంచేత మేనేజర్‌కు 9 కోట్లు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. అన్నట్టు పూజా దద్లానీ కూడా కేవలం మేనేజర్‌గానే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఏడాదికి ఈమె సంపాదన 50 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ముంబాయిలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా పెళ్లి చేసుకున్నారు. వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది.

Updated On 8 Sep 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story