స్టార్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్(die hard fans) ఉంటారు. వారు తమ అభిమానాన్ని రకరకాలుగా చూపించుకుంటుంటారు. అందులోకాస్త డిఫరెంట్ గా ఆలోచించేవారు కూడా ఉన్నారు. చిత్ర విచిత్రంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈక్రమంలోను ఓ బెంగాల్ అభిమాని బాలీవుడ్ బాద్ షా కోసం స్పెషల్ గా గిఫ్ట్ ఒకటి తయారు చేశాడు. అందరికి ఆశ్చర్య పరిచారు.

షారుఖ్ ఖాన్(shah rukh khan) కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన అభిమాని. పఠాన్ కోసం పఠాన్(pathan) లుక్ లో ఉన్న ఆయన ప్రతిరూపాన్ని అచ్చంగా దించేశాడు. వివరాల్లోకి వెళ్తే..

స్టార్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్(die hard fans) ఉంటారు. వారు తమ అభిమానాన్ని రకరకాలుగా చూపించుకుంటుంటారు. అందులోకాస్త డిఫరెంట్ గా ఆలోచించేవారు కూడా ఉన్నారు. చిత్ర విచిత్రంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈక్రమంలోను ఓ బెంగాల్ అభిమాని బాలీవుడ్ బాద్ షా కోసం స్పెషల్ గా గిఫ్ట్ ఒకటి తయారు చేశాడు. అందరికి ఆశ్చర్య పరిచారు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని అస‌న్‌సోల్‌(Asansol)లో ఓ ఆర్టిస్ట్ కింగ్ ఖాన్ ప‌ఠాన్ గెట‌ప్‌లో ఉన్న మైన‌పు(Wax) విగ్ర‌హాన్ని(Idol) త‌యారుచేశాడు.ఆర్టిస్ట్ సుశాంత్ రాయ్(shushant roy).. దాదాపుగా రెండు నెల‌ల పాటు శ్ర‌మించి షారుక్ ఖాన్ లైఫ్ సైజ్ మైన‌పు బొమ్మను తయారుచేశాడు. అస‌న్‌సోల్‌లోని త‌న సొంత మ్యూజియంలో రాయ్ షారుఖ్ విగ్ర‌హాన్ని ఉంచాడు. ఇక ఈ విగ్ర‌హాన్ని ఈమధ్యే ఆవిష్క‌రించగా.. భారీ ఎత్తున షారుఖ్ ఫాన్స్ ఈ బోమ్మను సందర్భించి ఫోటోలు తీసుకుంటున్నారు. అంతే కాదు గతంలో సుశాంత్ చాలా మంది బాలీవుడ్ స్టార్స్ మైనపు బొమ్మలను తయారు చేశారు.

సుశాంత్ రాయ్ చేసిన షారుఖ్ ఖాన్ విగ్రహం పఠాన్ సినిమాలోని లుక్ లో ఉంది. సుశాంత్ కు ఈ పఠాన్ స్టాట్యూ తొమ్మిదో విగ్ర‌హ‌మ‌ని తెలుస్తోంది. ఇక షారుఖ్ విగ్రహాన్ని అస‌న్‌సోల్ నగర మేయ‌ర్ విధాన్ ఉపాధ్యాయ్ ఆవిష్క‌రించి రాయ్ ప‌నితీరును మెచ్చుకున్నారు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీం ఓన‌ర్ అయిన త‌ర్వాత బెంగాల్‌లో కూడా షారుక్ ఖాన్ పాపులారిటీ పెరిగిపోయింది. ఇక షారుక్‌ విగ్ర‌హంతో అస‌న్‌సోల్‌కు టూరిస్టుల సంఖ్య పెరుగుతుంద‌ని సుశాంత్ రాయ్‌, విధాన్ ఉపాధ్యాయ్‌లు పేర్కొన్నారు.

Updated On 3 May 2023 12:27 AM GMT
rj sanju

rj sanju

Next Story