అమితాబ్‌ డాన్‌కు రీ బూట్‌ వెర్షన్‌లా ఫర్హాన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అప్పటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాసుకున్నారు ఫర్హాన్‌. ఇందులో షారూక్‌ సరసన ప్రియాంకా చోప్రా నటించింది. 40 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 105 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

డాన్‌ కో పకడ్నా ముష్కిల్‌ హీ నహీ నా ముమ్కిన్‌ హై! డాన్‌(Don) సినిమాలోని ఈ డైలాగ్‌ 1978లో మారుమోగిపోయింది. అందుకు కారణం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌(Amitabh bhachchan). అసలు డాన్‌ అంటే అమితాబ్‌బచ్చనే! డాన్‌ సూపర్‌డూపర్ హిట్టయ్యిందంటే అందుకు కారణం అమితాబే! సలీమ్‌ జావెద్‌లు అందించిన స్క్రిప్టును చంద్ర బారోత్‌ అద్బుతంగా తెరకెక్కించాడు. హైదరాబాద్‌లో అయితే డాన్‌ సినిమా సుమారు 500 రోజుల పాటు నడిచింది. అప్పుడా సినిమాకు అయిన ఖర్చు 70 లక్షల రూపాయలు. కానీ వసూళ్లు ఏడు కోట్ల రూపాయలు. పదింతలు లాభాన్ని తెచ్చిపెట్టిందా సినిమా. ఇదే సినిమాను తెలుగులో యుగంధర్‌ పేరుతో ఎన్టీఆర్‌తో తీశారు. తమిళంలో రజనీకాంత్‌తో(rajinikanth) బిల్లాగా తీశారు. మలయాళ, కన్నడ భాషల్లో కూడా వచ్చింది. అన్ని భాషల్లోనూ హిట్‌ కొట్టింది. ఈ సినిమా వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత షారూక్‌ ఖాన్‌(shah rukh Khan) సరికొత్త డాన్‌గా తెరపైకి వచ్చారు. షారూక్‌ హీరోగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో వచ్చిన డాన్‌ : ది చేజ్‌ బిగిన్స్‌ అగైన్‌(Dawn: The Chase Begins Again) సినిమా 2006లో వచ్చింది.

అమితాబ్‌ డాన్‌కు రీ బూట్‌ వెర్షన్‌లా ఫర్హాన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అప్పటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు రాసుకున్నారు ఫర్హాన్‌. ఇందులో షారూక్‌ సరసన ప్రియాంకా చోప్రా నటించింది. 40 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 105 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇంతగా హిట్‌ కొట్టిన డాన్‌ను అలా వదిలేయకూడదని షారూక్‌, ఫర్హాన్‌ అనుకున్నారు. అంతే డాన్‌: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్ అంటూ సెకండ్‌ వెర్షన్‌ను మొదలుపెట్టారు. డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ విడుదలైన అయిదేళ్లకు అంటే 2011 లో డాన్‌ 2 విడుదలయ్యింది. ఇందులోనూ షారుక్‌ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ సినిమాను 80 కోట్ల రూపాయలతో నిర్మించారు.

దాదాపు 200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. మొదటి వెర్షన్‌ డాన్‌కు ఫర్హాన్‌ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కు కూడా ఈ రెండు బాధ్యతలను ఫర్హానే వహించాడు. షారూక్‌ కూడా భాగస్వామి అయ్యాడు.
డాన్‌ క్యారెక్టర్‌తో సినీ ప్రేక్షకులకు గాఢమైన అనుబంధం ఉంది. అలాగే షారుక్‌ కూడా డాన్‌ పాత్రపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఫర్హాన్‌కు కూడా ఆ పాత్ర అంటే ఎంతో మక్కువ. అందుకే 2011లో డాన్‌ 2ను విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డాన్‌ 3 గురించి పలు సందర్భాలలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. డాన్‌ 3 కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్‌ చాలాసార్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. త్వరలో డాన్‌ మూడో(Don-3) వెర్షన్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని సోషల్‌ మీడియా వేదికగా ఫర్హాన్‌ చెప్పుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన ఆ వీడియోలో 3 అనే అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్‌ థీమ్‌ మ్యూజిక్‌ వినిపిస్తూ ఉంది.

అయితే ఫర్హాన్‌ ఇప్పటి వరకు నటీనటులను ప్రకటించలేదు. షారుక్‌తో అయితే ఈపాటికి నటులను ప్రకటించేవారు కదా అనే చర్చ మొదలయ్యింది. కొత్త డాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh) నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. కాబట్టి థర్డ్‌ వెర్షన్‌లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్‌ ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయ్యారు. పైగా కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఫర్హాన్‌ అన్నాడంటే హీరోని మార్చే ఆలోచనలో ఉన్నట్టేనని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. చాలా మంది అభిమానులు ఫర్హాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చేస్తే షారుక్‌ చేయాలి . లేకపోతే డాన్‌ సిరీస్‌కు ముగింపు పలకాలి అని అంంటున్నారు. షారుక్‌ ప్లేస్‌లో వేరే డాన్‌ని చూడలేమని గట్టిగా చెబుతున్నారు. మరోవైపు రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆనందపడుతున్నారు. ఇంతకీ షారుక్‌ మరోసారి డాన్‌గా కనిపిస్తారా? లేక రణ్‌వీర్‌ డాన్‌గా వస్తారా? ఒకవేళ రణ్‌వీర్‌ డాన్‌ పాత్ర చేస్తే అమితాబ్‌కు దీటుగా నటించగలరా? అని నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు.

Updated On 9 Aug 2023 8:22 AM GMT
Ehatv

Ehatv

Next Story