కొన్ని రికార్డ్ లు అనుకోకుండా వస్తుంటాయి.. మరికొన్ని అనుకున్నా రావు...కొన్ని మాత్రం అదృష్టంలా తగులుకుంటాయి.ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(shah Ruk Khan)  నటించిన పఠాన్(Pathan) మూవీ రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది

కొన్ని రికార్డ్ లు అనుకోకుండా వస్తుంటాయి.. మరికొన్ని అనుకున్నా రావు...కొన్ని మాత్రం అదృష్టంలా తగులుకుంటాయి.ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(shah Ruk Khan) నటించిన పఠాన్(Pathan) మూవీ రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకోన్(Deepika Padukone) హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) కాంబినేషన్ లో వచ్చిన సినిమా పఠాన్. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత షారుక్ ఖాన్ కు భారీ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా.. పఠాన్. కంబ్ బ్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు షారుఖ్ ఖాన్. అనుకున్నట్టుగానే భారీ యాక్షన్ మూవీ పఠాన్ తో అనుకున్నది సాధించాడు బాద్ షా. మరి షారుఖ్ నుంచి సెన్సేషనల్ కం బ్యాక్ గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్ హిస్టరీ లోనే భారీ హిట్ అయ్యింది. జవసత్వాలు జారిపోయి. డీలా పడ్డ బాలీవుడ్ కు ఈ ఏడాది ఫస్ట్ 1000 కోట్ల గ్రాసర్ గా నిలిచి ఊపిరి ఐదింది పఠాన్ సినిమా.

ఇక ఈ భారీ హిట్ సొంతం చేసుకోండంతో.. మూవీని వరల్డ్ వైడ్ గా భారీ స్తాయిలో రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారు టీమ్. అందులో భాగంగా మెయిన్ గా రష్యా(Russia) సహా పలు కామన్వెల్త్ దేశాల్లో ఈ చిత్రం ఇప్పుడు రికార్డు రిలీజ్ కి రాబోతుందట. ఈ జూలై 13న పఠాన్ ను రష్యాలో భారీస్థాయిలో రిలీజ్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొలపాలని చూస్తున్నారట మేకర్స్. దానికోసం ఏకంగా 3000 స్క్రీన్స్ కి పైగా సెలక్ట్ చేశారు. ఇన్ని స్క్రీన్స్ లో పఠాన్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే విదేశాల్లో రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్, తారక్ లాంటి వారు భారీ ఇమేజ్ ను సాధించారు. ఇక మొదటి నుంచి విదేశాల్లో మంచి ఇమేజ్ ఉన్న షారుఖ్ .. విదేశాల్లో ఎలాంటి రికాడ్స్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి. ఈ సెన్సేషనల్ రిలీజ్ తోనే మొదటి రికార్డ్ ను సాధించారు టీమ్. ఇక వసూళ్ల పరంగా ఎంత రాబడుతుందా అని అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Updated On 10 Jun 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story