లేడీసూపర్‌స్టార్ నయనతార(Nayanthara) సౌందర్యరాశి అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందమైన నటి అన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్(Shah Rukh Khan) నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. పఠాన్ సినిమా(Pathaan Movie)తో కోట్లాది రూపాయల కలెక్షన్లను సంపాదించిన షారూక్ ఇప్పుడు జవాన్ సినిమా(Jawaan Movie)తో రాబోతున్నారు.

Shah Rukh Khan
లేడీసూపర్‌స్టార్ నయనతార(Nayanthara) సౌందర్యరాశి అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందమైన నటి అన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్(Shah Rukh Khan) నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. పఠాన్ సినిమా(Pathaan Movie)తో కోట్లాది రూపాయల కలెక్షన్లను సంపాదించిన షారూక్ ఇప్పుడు జవాన్ సినిమా(Jawaan Movie)తో రాబోతున్నారు. రెడ్ చిల్లిస్ ఎంటర్‌టైన్‌మెంట్(Red Chillies Entertainment) సంస్థ నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. అద్భుతమైన నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఓ ముఖ్య పాత్రను పోషించాడు.
అట్లీ(Atlee)డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు షారూక్ తెలిపారు. ఈ సంద్భరంగా ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు షారూక్. జవాన్ పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ సినిమా అని చెబుతూ నయనతారతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నయనతార చాలా అందగత్తె అని, స్వీటీ అని ప్రశంసించారు. విజయ్ సేతుపతి గురించి చెబుతూ ఆయన చాలా ప్రతిభావంతుడైన నటుడని, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారని అన్నారు. విజయ్ సేతుపతి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని వివరించారు.
