మంగళవారం సాయంత్రం ప్రసార్‌ ఐ మాక్స్‌(I max)లో శాకుంతలం(shaakunthalam) చిత్రానికి సంబంధించిన త్రిడి ట్రైలర్‌(3D Trailer)ని మీడియాకి, అబిమానులకు చూపించారు. ధియేటర్‌ క్రిక్కిరిసిపోయింది. కళ్ళు చెదిరిపోయేట్టుంది ట్రైలర్‌. త్రిడి ఎఫెక్ట్...అందులో షాట్స్ గొప్పతనం కలగలసి విజువల్‌ వండర్‌లా మతిపోగొట్టింది.

మంగళవారం సాయంత్రం ప్రసార్‌ ఐ మాక్స్‌(I max)లో శాకుంతలం(shaakunthalam) చిత్రానికి సంబంధించిన త్రిడి ట్రైలర్‌(3D Trailer)ని మీడియాకి, అబిమానులకు చూపించారు. ధియేటర్‌ క్రిక్కిరిసిపోయింది. కళ్ళు చెదిరిపోయేట్టుంది ట్రైలర్‌. త్రిడి ఎఫెక్ట్...అందులో షాట్స్ గొప్పతనం కలగలసి విజువల్‌ వండర్‌లా మతిపోగొట్టింది. నిజంగా దర్శకుడు గుణశేఖర్‌ అభినందనీయుడు. చరిత్రలో నిక్షిప్తమైన ఎన్నో ఘట్టాలు సినిమాలుగా అన్ని భాషల్లోనూ వచ్చాయి. మహాభారతం సరేసరి. పుంఖానుపుంఖాలుగా వచ్చేశాయి. శాకుంతలం కూడా మహాభారతంలోని ఆదిపర్వంలోని రసవత్తరమైన ఘట్టమే. కానీ ఈ తరం వారికి గుర్తపట్టలేనంత గతంలో ఈ ఘట్టం మీద రెండో మూడో సినిమాలు వచ్చాయి. అందులో తెలుగు ప్రేక్షకులకు మాత్రం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనిపించుకున్న నందమూరి తారక రామారావు నటించిన శకుంతల గుర్తుంది. కెవిరెడ్డి దర్శకుడు. అలనాటి గ్లామర్‌ క్వీన్‌ బి. సరోజాదేవి హీరోయిన్. సంగీతం మధురగాయకుడు ఘంటసాల.

ఆ తర్వాత ఎవ్వరూ శకుంతల జోలికి పోలేదు. అంత గొప్ప కథలో నటించే నటులూ లేరు. దర్శకలకూ ఆ అభిరుచి లోపించింది. కానీ ఇటువంటి పెద్ద కొండల్ని భరించగలిగే గట్స్‌ ఉన్న దర్శకుడు ఒక్కడే మళ్ళీ శకుంతల్ని పలుకరించే సాహసం చేశాడు. అదీ మామ్మూలు రేంజ్‌ బడ్జెట్‌ కాదు. రాత్రీ పగలు శ్రమించి, ఈ కమనీయ ఘట్టాన్ని తెరకెక్కించేందుక నానా ప్రయాస పడ్డాడు గుణశేఖర్‌. భారీ సెట్లు, భారీ తారాగణం ఇవన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. కొట్టిన పిండి. అందుకు ఆయన సినిమాలన్నీ దాదాపుగా అంటే ఒక్కడు నుంచి తీసుకుంటే రుద్రమదేవి వరకూ అన్నీ ఆయనవి సృజనాత్మక సాహసాలే. ఇప్పుడీ శాకుంతలం చిత్రానికి మరి కొన్ని అడుగులు దాటి, ఏకంగా త్రిడిలోనే ప్రజెంట్ చేసిన గుణశేఖర్‌ భారతీయ చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సార్థకతను సాధించాడని చెప్పాలి.

శాస్త్రోక్తమైన పురాణఘట్టాన్ని, లేటెస్ట్ టెక్నాలజీని కంబైన్‌ చేసి గుణశేఖర్‌ ఒక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారనిపించింది ట్రైలర్‌ చూశాక. పైగా శకుంతల క్యారెక్టర్ని కుర్రాళ్ళ గుండెచప్పుడు....సమంతాప్రభు చేయడం బంగారానికి తావి అబ్బినట్టయింది. ట్రైలర్‌ షో జరుగుతుండగానే ధెయేటర్‌లో యూత్‌ వెర్రికేకలు వేశారు. పిచ్చెక్కిపోయారు. పురాణయుగాన్ని త్రిడి ఎఫెక్ట్‌లో చూస్తుంటే అదొక మహా అద్బుతం. జేమ్స్ కేమరూన్‌, స్పిల్‌ బర్గ్ లాటి హాలీవుడ్‌ దర్శకులే మన పురాణాల ఆధారంగా సినిమాలు తీస్తున్నామని, మన పురాణ పాత్రలే ఇన్సిపిరేషన్‌ అని చెప్పుకుంటున్న రోజులివి. మన పురాణాలకున్న విలువని మనకన్నా ముందుగా వారు గమనించడం ఇక్కడ గమనార్హం. ఇదొక రకంగా శాకుంతలం చిత్రానికి ఎడ్వాంటేజ్‌. ఇండియా సరే....అన్ని భాషలవారు అటు శాకుంతలం ఘట్టాన్ని ఎంజాయ్‌ చేస్తారు. పైగా టెక్నాలజీ ఫీస్ట్ కాబట్టి నవతరం కూడా భుజాలకెత్తుకుంటారు. సమంత బోనస్‌. బాహుబలి, త్రిబుల్‌ ఆర్‌ పుణ్యమా అని దేశవిదేశాలలో మనచిత్రాలకి మాంచి ఆటవిడుపు దొరికింది. ప్రపంచవేదిక శాకుంతలం చిత్రాన్ని సునాయాసంగా లాక్కుంటుంది. వీటన్నిటినీ గోల్డెన్‌ హ్యాండ్‌గా పేరు తెచ్చాకున్న దిల్‌ రాజు ఈ చిత్రినిర్మాతగా భాగస్వామ్యం వహించడం శాకుంతలం చిత్రానికి పెద్ద ఎసెట్‌. డబ్బు ఖర్చు పెట్టగల దమ్మున్న నిర్మాత, అభిరుచి కోసం దేనికీ వెనుకాడని ధైర్యవంతుడు. అందుకే శాకుంతలం బడ్జెట్ ఫిగర్స్‌ని భయపెట్టలేకపోయింది. ఎంతంటే అంతా ఖర్చు పెట్టారు. త్రిడి ఎఫెక్ట్ కోసం నెలల తరబడి గుణశేఖర్‌, దిల్‌రాజు కాచుక్కూచున్నారు.

అంతిమంగా బ్రహ్మాండమైన అవుట్‌పుట్‌ని సాధించారు. ట్రైలరే ఇలా ఉంటే సినిమా అంతా ఎలా ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానాలు రాజ్తే పెద్ద గ్రంధమయితీరుతుంది. దిల్‌రాజు పూనుకుంటే బలగం లాటి అర్భక చిత్రాలే కాదు, శాకుంతలం లాటి మహత్తర చిత్రాలు కూడా తెలుగు చిత్రసీమను వరిస్తాయి. మళ్ళీ మరోసారి రాయాలి...గుణశేఖర్‌ అసాధ్యుడు. దిల్‌రాజు నిజంగానే దిల్లున్న రాజు. .

Updated On 29 March 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story