శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)లో శంకుంతల పాత్రకోసం అసలు సమంత(Samantha)ను అనుకోలేదట దర్శకుడు. సడెన్ గా సమంతను తీసుకున్నామంటున్నారు స్టార్ డైరెక్టర్. కాస్త కొత్తగా ఆలోచించి సినిమాలు చేయాలి అంటే..అది గుణశేఖర్(Gunasekhar) ఒక్కడికే చెందుతుంది. ఆయన ఏ కథ తీసుకున్నా దాన్ని పక్కాగా కసరత్తు చేశాడు..

శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)లో శంకుంతల పాత్రకోసం అసలు సమంత(Samantha)ను అనుకోలేదట దర్శకుడు. సడెన్ గా సమంతను తీసుకున్నామంటున్నారు స్టార్ డైరెక్టర్. కాస్త కొత్తగా ఆలోచించి సినిమాలు చేయాలి అంటే..అది గుణశేఖర్(Gunasekhar) ఒక్కడికే చెందుతుంది. ఆయన ఏ కథ తీసుకున్నా దాన్ని పక్కాగా కసరత్తు చేశాడు.. హడావిడిగా సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులువేస్తున్న గుణశేఖర్(Director Gunasekhar).. ఈసారి సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాతో రాబోతున్నాడు. ఈక్రమంలో.. ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శాకుంతలం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు టీమ్. వరుసగా ఇంటర్వ్యులు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక ఏడాది పాటు చేశాము.. పర్ఫెక్ట్ గా షూటింగ్ లోకిదిగి 6 నెలల సమయాన్ని అనుకుని 81 వర్కింగ్ డేస్ లో సినిమాను పూర్తి చేశాము. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టైమ్ పట్టింది. మొత్తంగా సినిమాను 3 ఏళ్ళలో కంప్లీట్ చేశాం అన్నారు. అంతే కాదు సమంత గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు గుణశేఖర్.

ఈ సినిమాలో సమంత అద్భుతంగా చేసింది. కాని ముందు అసలు సమంతను తీసుకోవాలి అని నేను అనుకోలేదు.ఈ మూవీ గురించి రీసెర్చ్ చేస్తుంటే.. శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివాను. అందువలన ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్న టైమ్ లో.. మా అమ్మాయి సమంత పేరు చెప్పింది. సరే చూద్దాం అని ఓసారి రంగస్థలం సినిమా చూశాను... ఆ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడే అనకున్నాను ఇక నా సినిమాలో శకుంతలగా సమంతనే నటిస్తుంది.. ఆమెను సంప్రదించగా సరే అనేసింది అన్నారు గుణశేఖర్.

స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో మలయాల యంగ్ స్టార్ దేవ్ మోహన్ తో పాటు.. మోహన్ బాబు లాంటి సీనియర్ నటులు నటించారు. ఇక గుణశేఖర్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.

Updated On 29 March 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story