2024లో విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలు
జీవీ ప్రకాష్ : 2013లో తన స్కూల్‌మేట్, గాయని సైంధవిని వివాహం చేసుకున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, 2024 మే 13న విడాకులు ప్రకటించారు. వీరికి అన్వి అనే కుమార్తె ఉన్నది.
ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ : హీరో ధనుష్ మరియు ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ పెళ్లైన 20 సంవత్సరాల తర్వాత, 2024 నవంబర్ 27న విడాకులు తీసుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది.
సానియా మీర్జా : టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జనవరిలో తన భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తర్వాత షోయబ్ జూన్‌లో సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
ఉర్మిలా మటోండ్కర్ : నటి ఉర్మిలా మటోండ్కర్ సెప్టెంబర్‌లో తన భర్త మోహసిన్ అఖ్తర్ మిర్‌తో విడాకులు ప్రకటించింది. ఈ జంట పెళ్లైన ఎనిమిదేళ్ల తరువాత విడిపోయింది
హార్దిక్ పాండ్య-నటాసా స్టాంకోవిక్ : నటి నటాసా స్టాంకోవిక్ మరియు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య జులై 18న విడాకుల గురించి ప్రకటించారు. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోయింది. వీరికి అగస్త్య అనే కొడుకు ఉన్నాడు.
ఏఆర్ రెహ్మాన్: ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, ఆయన భార్య సైరా భాను 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు ప్రకటించారు. 1995లో వివాహం చేసుకున్న ఈ జంట 2024లో తమ బంధానికి ముగింపు పలికింది
జయం రవి : ప్రముఖ తమిళ నటుడు జయం రవి 2024 సెప్టెంబర్‌లో తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నారు.