బిగ్ బాస్ సీజన్ 7 సందడి స్టార్ట్ అయ్యింది తెలుగులో. ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక గతం ఆరుసీజన్ల ను దృష్టిలో పెట్టుకుని ఏడవ సీజన్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. మరీ ముఖ్యంగా సీజన్ 5 సీజన్ 6 బాగా నిరాశపరిచింది. దాంతో ఈసారి సీజన్ 7 ను.. జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. రేటింగ్ విషయంలో.. గత రెండు సీజన్లు బాగా నిరాశపరిచాయి. దాంతో ఈసారి బ్లాస్టింగ్ రేటింగ్స్ కోసం చూస్తున్నారు.

బిగ్ బాస్ హడావిడి మళ్లీ స్టార్ట్ అయ్యింది. తెలుగులో ఈసారి సీజన్ 7 సందడి చేయబోతోంది. ఈసారి అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వహకులు. దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ.. నెట్టింట్లో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 సందడి స్టార్ట్ అయ్యింది తెలుగులో. ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక గతం ఆరుసీజన్ల ను దృష్టిలో పెట్టుకుని ఏడవ సీజన్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. మరీ ముఖ్యంగా సీజన్ 5 సీజన్ 6 బాగా నిరాశపరిచింది. దాంతో ఈసారి సీజన్ 7 ను.. జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. రేటింగ్ విషయంలో.. గత రెండు సీజన్లు బాగా నిరాశపరిచాయి. దాంతో ఈసారి బ్లాస్టింగ్ రేటింగ్స్ కోసం చూస్తున్నారు.

అందుకే బాగా ఫేమస్ ముఖాలను బిగ్ బాస్ హౌస్ లో కనిపించేలా ప్లన్ చేస్తున్నారట టీమ్. అంతే కాదు కాస్త కాంట్రవర్సీ.. ఎక్కువగా కామెడీ.. కన్నింగ్ తో పాటు.. ఫైర్ బ్రాండ్స్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారు. ఇక బిగ్ బాస్ కు బాగా కలిసి వచ్చిన కాన్సెప్ట్ ల్లో.. కపుల్ కాన్సెప్ట్ కూడా ఒకటి. ఈసారి ఫేమస్ కపుల్స్ ను హౌస్ లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా చాలా రోజులుగా సీరియల్ కపుల్స్ అమర్ దీప్, తేజస్వీ గౌడ పేర్లు ఈ లిస్ట్ లో వినిపిస్తున్నాయి.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు అమర్ దీప్, కేరాఫ్ అనసూయతో పాపులర్ అయ్యింది తేజస్వీ.. వీరిద్దరు 2021 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ప్రేమలో మునితి తేలిన వీరు.. పెళ్ళి బంధంతో భార్య భర్తలుగా మారారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన తేజస్వీ.. తెలుగు సీరియల్స్ లో ద్వారా ఇంకా ఫేమస్ అయ్యింది. కన్నడాలో కూడా చాలా షోస్ చేసింది బ్యూటీ. ఇక వీరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోబోతున్నారట.

వీరిద్దరిని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారట సోహెల్, అరియానాలు. వీరితో ఎప్పటి నుంచో అమర్ దీప్ కు, తేజస్వీకి స్నేహం ఉంది. వీరి పెళ్ళికి కూడా వీరు హాజరయ్యారు. దాంతో వీరు బిగ్ బాస్ లోకి వెళ్ళేందుకు అరియానాతో పాటు.. సోహెల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే లాగేయడానికి చూస్తున్నారట టీమ్.

Updated On 18 July 2023 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story