తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్(Ravinder Chandrasekhar) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు కాబట్టి ఆయన గురించి నెటిజన్లకు బాగా తెలుసు. లాస్టియర్ నటి మహాలక్ష్మి శంకర్‌ను(Mahalakshmi Shankar) ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! అప్పట్నుంచే ఆయన తరచూ వార్తల్లో వ్యక్తి అవుతున్నాడు.

Producer Ravindar Arrest
తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్(Ravinder Chandrasekhar) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు కాబట్టి ఆయన గురించి నెటిజన్లకు బాగా తెలుసు. లాస్టియర్ నటి మహాలక్ష్మి శంకర్‌ను(Mahalakshmi Shankar) ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! అప్పట్నుంచే ఆయన తరచూ వార్తల్లో వ్యక్తి అవుతున్నాడు. ఇప్పుడాయన చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(Central Crime Branch) రవీందర్‌ను అరెస్ట్(Arrest) చేసింది. కారణమేమిటంటే ఓ వ్యాపారవేత్తను ఆయన మోసం చేశాడట! ఘన వ్యర్థాల ఉంచి విద్యుత్తును(Electricity) ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టి బోల్డన్నీ లాభాలు గడించవచ్చని రవీందర్ చెన్నైకి చెందిన బాలాజీ(Balaji) అనే వ్యక్తిని నమ్మించాడు.
ఇందుకు కావాల్సిన పత్రాలను నకిలీవి తయారు చేశాడు. బాలాజీని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు. ఇందుకోసం ఆయన దగ్గర నుంచి 15.83 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య 2020, సెప్టెంబర్17 ఒప్పందం జరిగింది. ఇక్కడి వరకు ఓకే కానీ, ఒప్పందంలో చెప్పిన వాగ్దానాలను ఇప్పటి వరకు రవీందర్ నెరవేర్చలేదు. డబ్బు తిరిగి ఇచ్చేయమని బాలాజీ ఎన్నిసార్లు అడిగినా రవీందర్ నుంచి సరైన జవాబు రావడం లేదు. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నాడు బాలాజీ.
రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్ధిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో కంప్లయింట్ చేశారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళంలో రవీందర్ చాలా సినిమాలు తీశాడు. తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. రవీందర్ చంద్రశేఖర్ ఇదివరకే చాలా వివాదాలలో చిక్కుకుని ఉన్నాడు. గతంలో విజయ్ అనే తన ఫ్రెండ్ దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని, ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేస్తానని నమ్మించి మోసం చేశాడు. ఆ కేసు కూడా రవీంరద్‌పై ఉంది.
