ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సాగిపోతుంటుంది నటి కస్తూరి. ప్రస్తుతం తెలుగులో గృహలక్ష్మి సీరియల్ చేస్తోన్న సీనియర్ నటి.. అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో వివాదాస్పంద వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్ అవుతుంటుంది. ఆమధ్య సరోగసి పద్ధతిపై కస్తూరి చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారమే రేపాయి. ఇక తాజాగా ప్రభాస్‌పై నోటికొచ్చిన కామెంట్ యేపి..వారి ఆగ్రహానికి కారకురాలు అయ్యింది కస్తూరి.

సినిమాల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటుంది నటి కస్తూరి. ఎప్పుడూ ఎదో ఒక వివాదానని కోరి తెచ్చుకుంటుంది సీనియర్ నటి. ప్రస్తుతం ప్రభాస్ ప్యాన్స్ ను కెలికి మరీ కౌంటర్లు వేయించుకుంటుంది.

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సాగిపోతుంటుంది నటి కస్తూరి. ప్రస్తుతం తెలుగులో గృహలక్ష్మి సీరియల్ చేస్తోన్న సీనియర్ నటి.. అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో వివాదాస్పంద వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్ అవుతుంటుంది. ఆమధ్య సరోగసి పద్ధతిపై కస్తూరి చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారమే రేపాయి. ఇక తాజాగా ప్రభాస్‌పై నోటికొచ్చిన కామెంట్ యేపి..వారి ఆగ్రహానికి కారకురాలు అయ్యింది కస్తూరి.

ప్రభాస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆదిపురుష్‌ (Adipurush) మూవీలో నటిస్తున్నాడు. నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా (Lord Ram) కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్‌ని కూడా ఇప్పటికే మూవీ టీమ్ ఎప్పుడో రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ లో రాముడి లుక్ పై డిఫరెంట్ కామెంట్లు చేసింది కస్తూరి.

ఆదిపురుష్‌లో ప్రభాస్‌ లుక్‌ చూస్తుంటే ఆయన రాముడిలా లేరని.. కర్ణుడి లా ఉన్నారంటూ డిఫరెంట్ కామెంట్లు చేసింది. రాముడిని, లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటి..? అని ప్రశ్నించింది. తెలుగు సినిమాల్లో ఎంతో మంది నటులు రాముడి పాత్రల్లో తెరపై ఎంతో అందంగా కనిపించారని.. కానీ, ఈ చిత్రంలో ప్రభాస్‌ మాత్రం కర్ణుడిలా ఉన్నారంటూ.. కస్తూరి ట్వీట్‌ చేసింది. అంతే కాదు ఆమె కామెంట్లు కు సబంధించి రాముడి లుక్ లో ఉన్న ఫోటోలను శేర్ చేశారు కస్తూరి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కస్తూరిపై మండిపడుతున్నారు.

ప్రభాస్‌ ( Prabhas) రాముడిగా.. కృతీ సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్‌ (Adipurush). రామాయణం లో ఓ భాగాన్ని తీసుకుని.. తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. జూన్‌ 16వ తేదీన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Updated On 9 Jun 2023 11:07 PM GMT
Ehatv

Ehatv

Next Story