గుప్పెండంత మనసు(Gupedantha Manasu) సీరియల్ చూసే వారికి జ్యోతిరాయ్(Jyothiram) తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఆ సీరియల్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. కన్నడలో ఈమె 20కిపైగా సీరియల్స్‌లో నటించారు. కన్నడ ప్రేక్షకులకు కూడా ఈమె చాలా దగ్గర. పలు సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఆమెకు ఉంది. శాండల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్(Pretty Girl) అనే క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్‌లో కూడా జ్యోతిరాయ్ నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ కన్నడ స్టార్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బుల్లితెర స్టార్ జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం కథనాల్లో నిజం ఉందనిపిస్తోంది. శుక్ర, మానరాని మౌనమిది వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో(Sukupurvaj) జ్యోతిరాయ్ రిలేషనల్ ఉన్నారట. ఈ రెండూ చిత్రాలు ఓటీటీ వేదికగా బాగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం సుకు పుర్వాజ్ ఏ మాస్టర్ పీస్(A Mater Piece) అనే సినిమాను రూపొందిస్తున్నారు.
వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు జ్యోతిరాయ్. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఏకంగా ఈ జోడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. సీరియల్ నటి సుజాత పెట్టి కామెంట్ కూడా వీరు రిలేషన్‌లో ఉన్నారనడానికి బలం ఇస్తోంది. లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ అల్వేజ్ అంటూ సుజాత పెట్టిన కామెంట్‌కు థాంక్యూ డియర్ అంటూ జ్యోతిరాయ్ రిప్లై ఇచ్చారు. అంటే జ్యోతిరాయ్ తాము రిలేషన్‌లో ఉన్నామని ఒప్పుకున్నట్టేగా! ఇదలా ఉంటే జ్యోతిరాయ్‌కు 20 ఏళ్లున్నప్పడే పద్మానాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు.
జ్యోతిరాయ్ నటి కావడానికి పద్మానభనే కారణమని కన్నడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. కట్టుకున్న భర్తను వదిలేసి దర్శకుడు సుకు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్‌తో రిలేషన్‌లో ఉండటమేమిటని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్ మంగళూరులో చదువుకున్నారు. విను బలాంజ సీరియల్ బంఎ బరాటవ కాలా ద్వారా బుల్లితెరలో అడుగుపెట్టారు జ్యోతిరాయ్. తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. జోగుల, జోజో లల్లి, గెజ్జెపూజే, శుభమంగళ, లవలవికే, ప్రేరణ, కిన్నెరి, సిల్లీ లల్లీ, సవలిగే సై, మురుగంటు, శాంతల, కన్యాశుల్కం వంటి సినిమాలలో కూడా నటించారు. వీటితో పాటు సీతారామకళ్యాణ, గంధదగుడి, 99, దియ వర్ణ పాటల వంటి సినిమాల్లో నటించిన జ్యోతిరాయ్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.