ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్యకు(Addala Aishwarya) లాస్టియర్ సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లయ్యింది. భర్త పేరు శ్యామ్ కుమార్(Shyam kumar). పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. పెల్లి చేసుకుని డబ్బులన్నీ కాజేయడమే కాకుండా ఇప్పుడు విడాకులు కావాలంటూ అతడిని మానసికంగా హింసిస్తున్నదట! ఓ మ్యాట్రిమోనీ ద్వారా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్యకు(Addala Aishwarya) లాస్టియర్ సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లయ్యింది. భర్త పేరు శ్యామ్ కుమార్(Shyam kumar). పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. పెల్లి చేసుకుని డబ్బులన్నీ కాజేయడమే కాకుండా ఇప్పుడు విడాకులు కావాలంటూ అతడిని మానసికంగా హింసిస్తున్నదట! ఓ మ్యాట్రిమోనీ ద్వారా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు. నెల తర్వాత అసలు కథ మొదలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేశ్‌బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. ఇదేమిటని అడిగిన పాపానికి తనపైనే అన్యాయంగా కేసులు పెట్టిందని అంటున్నాడు. బెదిరిస్తున్నదని, పెళ్లయ్యాక తన దగ్గర నుంచి పాతిక లక్షల రూపాయలు కాజేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు శ్యామ్ కుమార్. విడాకులు కావాలంటూ తనను, తన కుటుంబాన్ని టార్చర్ పెడుతున్నదని తెలిపాడు. ఐశ్వర్య టీవీ సీరియల్సే కాకుండా మూడు నాలుగు సినిమాల్లో కూడా నటించింది.