విజయ్ కాంత్(Vijaykanth) సమాధిని(Grave) సందర్శించిన సూర్య(Surya) బోరున విలపించారు..అయితే ఆయన అలా చేయడం మొత్తం నాటకంఅంటూ..తమిళ నటుడు సీనియర్ జర్నలిస్ట్ ఒకరు సంచలన వ్యాక్యలు చేశారు.
విజయ్ కాంత్(Vijaykanth) సమాధిని(Grave) సందర్శించిన సూర్య(Surya) బోరున విలపించారు..అయితే ఆయన అలా చేయడం మొత్తం నాటకంఅంటూ..తమిళ నటుడు సీనియర్ జర్నలిస్ట్ ఒకరు సంచలన వ్యాక్యలు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సినీనటుడు విజయకాంత్ డిసెంబర్ 28న ఉదయం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు, రాజకీయ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. డీఎండికే కార్యాలయం ఎదుట విజయకాంత్‌కు చెందిన స్థలంలో ఆయన భౌతికకాయాన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
మరియు వేలాది మంది అభిమానులు, ప్రముఖులు మరియు DmDk పార్టీ కార్యకర్తలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు... ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin), మంత్రి ఉదయనిధి మరియు పలువురు అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే ఫారెన్ పర్యటనలో ఉండటంతో కొంత మంది స్టార్లు విజయకాంత్ ను ఆకరిచూపు చూసుకోలేకపోయారు. దాంతో విదేశాల నుంచి వచ్చిన తరువాత ప్రముఖులు ప్రముఖులు విజయకాంత్ సమాధి సందర్శించి పూలమాలలు వేసి కర్పూరం సమర్పించి నివాళులర్పించడమే కాకుండా విజయకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
వీరిలో జయం రవి, సూర్య లాంటిస్లార్లు ఉన్నారు. విజయకాంత్ మరణించిన సమయంలో నటుడు సూర్య విదేశాల్లో ఉండగా.. విజయకాంత్ గురించి ఉద్వేగంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సూర్య తన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీతో కలిసి విజయకాంత్ సమాధి దగ్గరకు వచ్చారు...కన్నీళ్లు పెట్టుకుని నివాళులర్పించారు. అనంతరం ప్రేమలత విజయకాంత్, విజయకాంత్ కుమారులను కలుసుకుని సంతాపం తెలిపారు.
ఇక సూర్య ఏడవడంపై పలువురు స్పందించగా.. అందులో సీనియర్ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లిజరిన్ పెట్టకుని ఏడ్చాడని... ఏడిస్తే కెప్టెన్ వస్తాడా.. ఆ ప్రేమ ముందు ఉండాలి అన్నట్టు గా విమర్శలు చేశారు. రాకపోతే మీ సినిమాలు ఎవరూ చూడరని వచ్చారంటూ.. రకరకాల విమర్శలు చేశారు. ప్రస్తుతం బైల్వాన్ రంగనాథన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.