భారతీయుడు(INDIAN) సినిమా చూసే ఉంటారు. అందులో పెద్ద కమలహాసన్‌(kamal haasan) సరసన నటించిన సుకన్య(Sukanya) గుర్తుండే ఉంటుంది. పెద్దరికం, అమ్మకొడుకు వంటి సినిమాలలో కథానాయికగా నటించారు. ఒకప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌. మలయాళంలో కూడా నటించిన సుకన్య దాదాపు 80 చిత్రాలలో కనిపించారు. ఆనాటి అగ్రహీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. కొంతకాలంగా ఈమె సినిమాల్లో కనిపించడం లేదు.

భారతీయుడు(INDIAN) సినిమా చూసే ఉంటారు. అందులో పెద్ద కమలహాసన్‌(kamal haasan) సరసన నటించిన సుకన్య(Sukanya) గుర్తుండే ఉంటుంది. పెద్దరికం, అమ్మకొడుకు వంటి సినిమాలలో కథానాయికగా నటించారు. ఒకప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌. మలయాళంలో కూడా నటించిన సుకన్య దాదాపు 80 చిత్రాలలో కనిపించారు. ఆనాటి అగ్రహీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. కొంతకాలంగా ఈమె సినిమాల్లో కనిపించడం లేదు. ఆనాటి హీరోయిన్లందరూ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంటే ఈమె మాత్రం వాటి జోలికి వెళ్లడం లేదు. పదేళ్ల కిందట శ్రీమంతుడులో మహేశ్‌బాబు తల్లిగా నటించిన సుకన్య తర్వాత వెండితెరకు దూరంగా ఉన్నారు. కెరీర్‌లో వెనుకబడిన సుకన్య వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సినిమాలలో బిజీగా ఉన్నప్పుడే శ్రీధర్‌ రాజగోపాల్‌(Sreedhar Rajgopal) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయారు. అయితే ఏడాదికే అంటే 2003లో అతడికి విడాకులు ఇచ్చారు. మళ్లీ నటనపైన దృష్టి పెట్టారు. క్యారెక్టర్‌ పాత్రలు వేశారు. టీవీ షోలలో మెరిశారు. కొన్ని సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో ఓ సీరియల్‌లో నటిస్తున్నారు. అలాగని తానేమీ సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించలేదంటున్నారు సుకన్య. దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి ఎన్నో అవార్డులను అందుకున్నానని, సినిమా వల్లనే తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చప్పారు. సినిమా అవకాశాలు రాకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదని, ఎవరూ తనను పిలవడం లేదని అన్నారు. మళ్లీ అవకాశం వస్తే సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని సుకన్య చెప్పుకొచ్చారు.

Updated On 30 March 2024 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story