పెద్దరికం సినిమా(Peddarikam Movie)లో జగపతిబాబు(Jagapathi Babu) సరసన నటించిన హీరోయిన్ గుర్తున్నారా? భారతీయుడు సినిమాలో కమలహాసన్(Kamal Haasan)
సరసన నటించింది కూడా ఈమే! తమిళంలో అగ్రహీరోలందరితో నటించిన ఆమె పేరు సుకన్య(Sukanya). మలయాళం, కన్నడలో చాలా సినిమాల్లో నటించారు. శ్రీమంతుడులో మహేశ్‌బాబుకు తల్లిగా నటించారు.
పెద్దరికం సినిమా(Peddarikam Movie)లో జగపతిబాబు(Jagapathi Babu) సరసన నటించిన హీరోయిన్ గుర్తున్నారా? భారతీయుడు సినిమాలో కమలహాసన్(Kamal Haasan)
సరసన నటించింది కూడా ఈమే! తమిళంలో అగ్రహీరోలందరితో నటించిన ఆమె పేరు సుకన్య(Sukanya). మలయాళం, కన్నడలో చాలా సినిమాల్లో నటించారు. శ్రీమంతుడులో మహేశ్‌బాబుకు తల్లిగా నటించారు. తెలుగులో అమ్మకొడుకు, సాంబ, శ్రీమున్నా, అధినాయకుడు వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుకన్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారన్నదే ఆ వార్త! నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే 2002లో శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు సుకన్య. తర్వాత భర్తతో పాటు అమెరికాకు వెళ్లిపోయారు. ఏమైందో ఏమోగానీ ఏడాదిలోనే శ్రీధరన్ నుంచి విడాకులు తీసుకుని ఇండియాకు వచ్చేశారు. మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. దక్షిణాది సినిమాల్లో సహాయ పాత్రలు వేస్తూనే మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుకన్యకు 50 ఏళ్లు. ఈ వయసులో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతి ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సుకన్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పెళ్లి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు అమ్మ అని పిలుస్తారా? లేక అమ్మమ్మ అని పిలుస్తారా? అని తప్పుడు రాతగాళ్లకు కౌంటర్ వేశారు.