అలాంటి బట్టలు వేసుకోకూడదు
మలయాళ సినిమా(Malyalam Movies) ఇండస్ట్రీలో మహిళలు లైంగిక వేధింపులను(Sexual harrasments) ఎదుర్కొంటున్నారని, లింగ వివక్ష భయంకరంగా ఉందని హేమ కమీషన్ రిపోర్ట్ ఇచ్చిన విషయం విదితమే కదా! ఈ కమిటీలో సభ్యురాలిగా మన నటి శారద కూడా ఉన్నారు. ఆమె కమిటీకి కొన్ని సూచనలు చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలు ధరిస్తున్న దుస్తులపై ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు ఇప్పుడు వేసుకుంటున్న బట్టలు(Costumes) సరిగ్గా ఉండటం లేదని శారద వాపోయారు. శరీరాన్ని దాచి పెట్టడం కంటే వాళ్లు వేసుకుంటున్న దుస్తులు, శరీర భాగాలను మరింతగా చూపిస్తున్నట్టుగా ఉందని శారద అన్నారు. సినిమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని శారద అన్నారు. ఒకప్పుడు సెట్స్ దగ్గర డబుల్ మీనింగ్ సంభాషణలు ఉండేవి కాదన్నారు. అలాగే లైంగిక దాడులు కూడా ఉండేవి కాదని, కనీసం ఎవరూ తాకేవారు కూడా కాదని శారద చెప్పారు. మనపై వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ఎక్కువగా ఉందని శారద అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా కలిసిపోతున్నారని, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనేది చాలా కామన్ అయ్యిందని, ఈ జనరేషన్ కల్చర్ మరోలా ఉందని, చాలా ఈజీగా కాంప్రమైజ్ అవుతున్నారని అన్నారు. నేటి తరం మహిళలు చదువుకున్నారని, వాళ్లు తమ హక్కుల గురించి పోరాడుతున్నారని, నిర్మాత, దర్శకులకు వారి వల్ల ఎటువంటి సమస్య రావద్దు అని శారద అభిప్రాయపడ్డారు.