✕
Senior actress Revathi : నటి రేవతి విడాకులకు అదే కారణం.. చివరి అలా.. !
By EhatvPublished on 20 April 2023 5:58 AM GMT
అయితే నటి రేవతి (Revathi) భరతనాట్యం (Bharatanatyam) డ్యాన్సర్. ఏడేళ్ల వయస్సు నుంచి ఆమె డాన్స్ నేర్చుకుంది. 1979 సంవత్సరంలో చెన్నైలో ఆమె తొలిసారి నర్తించింది. అయితే సినిమాలకే కాకుండా అనేక రకాల సామాజిక సంస్థల్లో కూడా పార్టిసిపేట్ చేసింది.

x
Actress Revathi Divorce
-
- సౌత్‌కు చెందిన ఫేమస్ నటి రేవతి (Revathi) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఆ తర్వాత మథర్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తుంది. అయితే రేవతి నటి మాత్రమే కాదు ఒక దర్శకురాలు కూడా. ఈమె మలయాళం, తమిళ సినిమాల్లో ఎక్కువ గుర్తింపు పొందింది. ఆమె మూడు వేర్వేరే కేటగిరీల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్స్‌తో పాటు పలు ప్రశంసలు అందుకుంది.
-
- అయితే నటి రేవతి (Revathi) భరతనాట్యం (Bharatanatyam) డ్యాన్సర్. ఏడేళ్ల వయస్సు నుంచి ఆమె డాన్స్ నేర్చుకుంది. 1979 సంవత్సరంలో చెన్నైలో ఆమె తొలిసారి నర్తించింది. అయితే సినిమాలకే కాకుండా అనేక రకాల సామాజిక సంస్థల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. వీటిలో ముఖ్యంగా బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి చిత్రోత్సవాల్లో సభ్యురాలి ఈమె పనిచేసింది.
-
- నటి రేవతి కొచ్చిన్ (Cochin)లో జన్మించిది. ఆమె అసలు పేరు ఆశా కెలున్నీ నాయర్ (Asha Kelunni Nair). ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన కేలున్నీ నాయర్, లలితే కేలున్నీ దంపతులకు జన్మించింది. ఆమె చిన్న వయస్సులోనే ఓ ఫ్యాషన్‌లో పార్టిసిపేట్ చేసింది. అయితే ఆ ఫ్యాషన్ షోలో ఆమె దిగిన గ్రూప్ ఫొటో తమిళ మ్యాగజైలో రావడంతో అప్పట్లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ ఫొటోలో ఆమెను చూసిన డైరెక్టర్ భారతీరాజా (Bharathi raja).. ఆయన దర్శకత్వం వహించే మ్యాన్ వసనై (Mann Vasanai) సినిమాలో అవకాశం ఇచ్చారు.
-
- 1983లో ఆ తమిళ చిత్రంతో రేవతి వెండి తెరకు పరిచయం అయింది. ఆ సినిమా మంచి విజయం సాధించి.. ఫలిమ్ ఫేర్ స్పెషల్ అవార్డును సొంతం చేసుకుంది. అదే ఇయర్లో ఆమె మలయాళం చిత్రం అయిన కట్టాతే కిలిక్కోడు ( Kattathe Kilikkoodu) చిత్రంలో మలయాళంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఎంటే కానకుక్కాయిల్, ఆంకలియుడ్ తారట్టు, కాక్కోటికవిలే అపోప్పన్ తడిగల్, పురావృతం వంటి చిత్రాల్లో రేవతి నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్‌తోనూ నటించిన ఆమె మంచి ప్రజాదరణ పొందింది.
-
- సినీ రంగంలో ఆమెకు మంచి పట్టు ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా వరకు తెలియదు. 1986లో రేవతి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్‌చంద్ర మీనన్‌ను పెళ్లాడింది. వీరిద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. అయితే వీళ్ల మధ్య వచ్చిన కుటుంబ సమస్యలు కారణంగా 2002 నుంచి ఇద్దరు విడిగా జీవిస్తున్న వీళ్లకు 2013 ఏప్రిల్ 23న చెన్నైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
-
- వీళ్ల విడాకుల (Divorce)కు ముఖ్యంగా రేవతి గర్భవతి కాకపోవడమే అని కారణమని చెప్పేవారు. సంతానం లేకపోవడం వలనే వారి వైవాహిక జీవితం దెబ్బతిందన్నారు. ఆ కారణంగానే వీళ్లు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. సురేష్ చంద్రతో విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత నటి రేవతి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా 48ఏళ్ల వయస్సులో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.
-
- అలా పుట్టిన ఆ బిడ్డకు మహి (Mahee) అని పేరు పెట్టుకుంది. తన కూతురికి ఊహ తెలిసిన తర్వాత తన వ్యక్తిగత జీవిత విషయాలను ఆమెకు చెబుతానంటోంది రేవతి. మలయాళ నటి గీతా విజయన్ రేవతికి బంధువు కూడాను.

Ehatv
Next Story