మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna), విజయ్‌వర్మ(Vijay Warma), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), నీనా గుప్తా(Neena Gupta) ప్రధాన పాత్రలలో నటించిన లస్ట్ స్టోరీస్ -2(Lust Stories2) శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. తన ఆన్‌స్క్రీన్ మొదటి ముద్దు అనుభవాన్ని చెప్పుకున్నారు.

Neena Gupta Recalls First Kissing Scene
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna), విజయ్‌వర్మ(Vijay Warma), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), నీనా గుప్తా(Neena Gupta) ప్రధాన పాత్రలలో నటించిన లస్ట్ స్టోరీస్ -2(Lust Stories2) శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. తన ఆన్‌స్క్రీన్ మొదటి ముద్దు అనుభవాన్ని చెప్పుకున్నారు. లిప్ కిస్ సీన్ పూర్తి కాగానే వెంటనే డెటాల్‌తో నోరు శుభ్రం చేసుకున్నానని నీనా గుప్తా తెలిపారు. ' ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల సీన్స్‌లో నటించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బురదలో దిగాల్సి వస్తుంది. మరికొన్ని సార్లు గంటలకొద్దీ ఎండలో నిలబడాల్సి ఉంటుంది. కొన్నేళ్ల కిందట దిలీప్ ధావన్(Dilip Dhawan)తో నేను ఒక సీరియల్‌లో నటించాను. అందులోని ఓ సీన్‌లో మాపై లిప్ టు లిప్ కిస్ సీన్‌ను చిత్రీకరించారు. భారత్ టెలివిజన్ చరిత్రలో అదే మొదటి లిప్ కిస్ సీన్. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. దిలీప్ ధవన్‌తో నాకు పరిచయం ఉంది. అందగాడు కూడా. అయినా ఈ పరిస్థితులకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆ సీన్‌లో నటించేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేను. ఆ సీన్‌లో నటించేందుకు ఎంతో కంగారుపడ్డాను. కొంతమంది కామెడీ చేయలేరు. మరికొంత మంది కెమెరా ముందు కన్నీళ్లు పెట్టలేరు అంటూ నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఈ సీన్ పూర్తికాగానే వెంటనే డెటాల్‌తో నా నోరు శుభ్రం చేసుకున్నా. అది నాకు ఎంతో కష్టంగా అనిపించింది' అని నీనాగుప్తా అన్నారు. దూరదర్శన్ తొలినాళ్లలో అనేక సీరియల్స్‌లో నటించిన నీనా గుప్తా తర్వాత వెండితెరపై కూడా అలరించారు. ఇష్క్, ఎలోన్, ముల్క్, 83, డయల్ 100, గుడ్‌బై వంటి సినిమాలలో నీనా కీలక పాత్రలు పోషించారు. అటు సినిమాలలో నటిస్తూనే ఇటు మెగా సీరియల్స్‌లో నటించారు.
